Uric Acid And Gout : యూరిక్ యాసిడ్‌, గౌట్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Uric Acid And Gout : ప్ర‌స్తుత కాలంలో ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే వారిలో ఈ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. సాధార‌ణంగా ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర‌పిండాలు వ‌డ‌క‌ట్టి బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపించే దాని కంటే ఎక్కువ‌గా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వ‌డం వ‌ల్ల అది శ‌రీరంలో పేరుకుపోతుంది. ర‌క్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తం ఆమ్ల‌త్వ గుణాన్ని ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి కీళ్ల మ‌ధ్య‌లో పేరుకుపోవ‌డం వ‌ల్ల కీళ్ల వాపులు, కీళ్లు ఎర్ర‌గా మార‌డం, ఎముక‌లు దెబ్బ‌తిన‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రావ‌డం వంటివి కూడా జ‌రుగుతాయి. ఈ స‌మ‌స్య‌ను మ‌నం ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక ఈ స‌మ‌స్య నుండి మ‌నం వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌టప‌డాలి. కొన్ని ర‌కాల ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించే చిట్కాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Uric Acid And Gout home remedies works wonderfully
Uric Acid And Gout

ముందుగా ఒక గ్లాస్ సొర‌కాయ జ్యూస్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ వేయించిన వాము పొడిని అలాగే పావు టీ స్పూన్ న‌ల్ల మిరియాల పొడిని వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న జ్యూస్ ను రోజూ ఉద‌యం అల్పాహారం తిన్న త‌రువాత తాగాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న వారు తిప్ప‌తీగ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. తిప్ప తీగ ర‌సం మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, అన్ లైన్ లో సుల‌భంగా ల‌భ్య‌మ‌వుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం చాలా సుల‌భంగా యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే మ‌నం క‌ల‌బంద జ్యూస్, ఉసిరికాయ జ్యూస్ ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. వీటితో మ‌నం ప్ర‌తిరోజూ ఎక్కువ‌గా నీటిని తాగాలి.

అలాగే శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న వారు ఆల్క‌హాల్ ను తీసుకోవ‌డం మానేయాలి. అలాగే టీ, కాఫీ ల‌ను ఎక్క‌వ‌గా తాగ‌కూడ‌దు. మ‌సాలా ఉండే వంట‌కాల‌ను తీసుకోవ‌డం మానేయాలి. తీపి ప‌దార్థాల‌ను, జంక్ ఫుడ్ ను, మాంసాహారాన్ని, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలాగే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా పెర‌గ‌కుండా ఉంటాయి.

D

Recent Posts