Varicose Veins : వెరికోస్ వీన్స్‌, న‌రాల్లో నొప్పులు, వాపుల స‌మ‌స్య‌కు చిట్కా.. ఏం చేయాలంటే..?

Varicose Veins : ప్ర‌స్తుత కాలంలో న‌రాల నొప్పులు, న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల్లో వాపులు, స‌యాటికా స‌మ‌స్య‌, వెరీకోస్ వెయిన్స్, న‌రాల్లో ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువవుతున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. మందులు వాడే అవ‌స‌రం లేకుండా ఒక చ‌క్క‌టి ఇంటి చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. అలాగే ఈ ప‌దార్థాల‌న్నీ కూడా మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం న‌ల్ల యాల‌కుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో ఇవి ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. న‌రాల్లో అడ్డంకుల‌ను తొల‌గించడంలో, ర‌క్తాన్ని శుభ్రం చేయ‌డంలో, కాలేయం ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, జీర్ణశ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన మ‌రో ప‌దార్థం ల‌వంగాలు. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఇవి దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తాయి. ర‌క్తప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, న‌రాల్లో అడ్డంకుల‌ను తొల‌గించ‌డంలో, న‌రాల‌ను బ‌లంగా చేయ‌డంలో ల‌వంగాలు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే మ‌రో వాడాల్సిన మ‌రో ప‌దార్థం దాల్చిన చెక్క‌. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దాల్చిన చెక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Varicose Veins home remedy what to do
Varicose Veins

అలాగే ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఆర్గానిక్ బెల్లాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. శ‌రీరానికి త‌గినంత శ‌క్తిని అందించ‌డంలో, శ‌రీరానికి మేలు చేయ‌డంలో బెల్లం ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ నాలుగు ప‌దార్థాల‌తో చ‌క్క‌టి క‌షాయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం న‌రాల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో న‌ల్ల యాల‌క్కాయ‌ను మెత్త‌గా దంచి వేసుకోవాలి. త‌రువాత ఇందులో రెండు ల‌వంగాల‌ను పొడిగా చేసుకుని వేసుకోవాలి. అలాగే రెండు చిటికెల దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై 6 నుండి 7 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఇందులో అర టీ స్పూన్ బెల్లాన్ని వేసి క‌ల‌పాలి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌పడే వారు బెల్లాన్ని ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

త‌రువాత దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న క‌షాయాన్ని ఎప్పుడైనా తాగ‌వ‌చ్చు. ప‌ర‌గ‌డుపున లేదా అల్పాహారం చేసిన గంట త‌రువాత అలాగే సాయంత్రం స‌మ‌యంలో టీ లాగా కూడా తాగ‌వ‌చ్చు. అయితే గ‌ర్భిణీ స్త్రీలు దీనిని తాగ‌కూడ‌దు. ర‌క్తం చిక్క‌గా మార‌డం, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌లో ఇబ్బందులు ఉండ‌డం, న‌రాల్లో అడ్డంకులు ఉన్న వారు ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వెరీకోస్ వెయిన్స్, స‌యాటికా వంటి స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అయితే దీనిని 15 రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవాలి. 15 రోజుల త‌రువాత తీసుకోవాలి అనుకున్న వారు ఒక రోజు గ్యాప్ ఇచ్చి మ‌ర‌లా తాగాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం న‌రాల స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. న‌రాల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

Share
D

Recent Posts