Whiten Teeth : ఈ 10 చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఇంటి ద‌గ్గ‌రే మీ దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు..!

Whiten Teeth : దంతాలు తెల్ల‌గా, అందంగా, ప్ర‌కాశ‌వంతంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. మ‌నం అందంగా క‌నిపించ‌డంలో మ‌న దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెల్ల‌గా ఉండే దంతాలు మ‌న ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతాయి. దంతాల‌ను తెల్ల‌గా ఉంచుకోవ‌డానికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే టీత్ వైటినింగ్ టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన ట్రీట్ మెంట్ ను చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇవ‌న్నీ కూడా చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. వీటికి బదులుగా ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల తెల్ల‌టి ఆరోగ్యవంత‌మైన దంతాల‌ను చాలా సుల‌భంగా సొంతం చేసుకోవ‌చ్చు. దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల‌టి దంతాల‌ను కోరుకునే వారు రోజూ కొబ్బ‌రి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయాలి.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనెను నోట్లో వేసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. చిగుళ్ల ఆరోగ్యంమెరుగుప‌డుతుంది. దంతాలు తెల్ల‌గా మార‌తాయి. దంతాల‌పై మ‌ర‌క‌ల‌ను తొల‌గించ‌డంలో బేకింగ్ సోడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ‌ర‌సంలో బేకింగ్ సోడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను దంతాల‌పై రాసి కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత నీటితో స‌రిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే మ‌ర‌క‌లు, ప‌సుపుద‌నం తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌తాయి. అలాగే దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో యాక్టివేట్ చేసిన బొగ్గు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. బొగ్గును బ్ర‌ష్ తో తీసుకుని దంతాల‌ను రుద్దుకోవాలి. త‌రువాత నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే మ‌ర‌కలు, కాలుష్య‌కార‌కాలు తొల‌గిపోతాయి.

Whiten Teeth 10 wonderful ways to try at home
Whiten Teeth

దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా మార‌తాయి. ఇక నోటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు దంతాల‌ను తెల్ల‌గా చేయ‌డంలో ఆవాల నూనె మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఆవాల నూనెలో ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంతో దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. దంతాలు మ‌రియు చిగుళ్ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. దంతాలు స‌హ‌జంగా తెల్ల‌గా మార‌తాయి. అదేవిధంగా స్ట్రాబెరీల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. స్ట్రాబెరీల‌ను పేస్ట్ గా చేసి అందులో బేకింగ్ సోడా క‌లిపి దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్ట్రాబెరీల‌లో ఉండే మాలిక్ యాసిడ్ దంతాల‌ను తెల్లగా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే రోజూ దంతాల‌ను శుభ్రం చేసుకునే ముందు ఒక నిమిషం పాటు దంతాల‌ను యాపిల్ సైడ‌ర్‌ వెనిగ‌ర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌డంతో పాటు నోటి ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. వీటితో పాటుగా పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా న‌మిలి తినాలి. ఇలా చేయ‌డంవ‌ల్ల నోట్లో లాలాజ‌లం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. దీంతో నోట్లో ఉండే క్రిములు న‌శిస్తాయి. దంతాల‌పై పేరుకుపోయిన ప‌సుపుద‌నం, పాచి తొల‌గిపోతాయి. అలాగే కాఫీ, టీ, రెడ్ వైన్ వంటి వాటిని తీసుకోవ‌డం త‌గ్గించాలి. ఇవి దంతాల‌పై మ‌ర‌క‌ల‌ను ఏర్ప‌రుస్తాయి. కనుక వీటిని తీసుకోవ‌డం పూర్తిగా త‌గ్గించాలి. అదే విధంగా నీటిని ఎక్కువ‌గా తాగాలి. నీటిని తాగ‌డం వ‌ల్ల దంతాల‌పై మ‌ర‌క‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా దంతాల‌ను మ‌నం ఎల్ల‌ప్పుడూ తెల్ల‌గా, ఆరోగ్యంగా, ప్ర‌కాశ‌వంతంగా ఉంచుకోవ‌చ్చు.

D

Recent Posts