Whiten Teeth : ఎలాంటి దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే.. తెల్ల‌గా మారుతాయి..!

Whiten Teeth : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్ల‌గా, కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌న‌బ‌డ‌తాము. అయితే మ‌న‌లో చాలా మందికి దంతాల‌పై గార పేరుకుపోయి దంతాలు ప‌సుపు రంగులో క‌న‌బ‌డుతున్నాయి. దీంతో చాలా మంది న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నారు. అలాగే చ‌క్క‌గా న‌వ్వ‌లేక‌పోతున్నారు. దంతాల‌పై గార‌ను, ప‌సుపుద‌నాన్ని పోగొట్ట‌డానికి ర‌క‌ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటారు. అయిన ఫ‌లితం లేక మ‌న‌లో చాలా మంది ఇబ్బందిప‌డుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా అర చెక్క ట‌మాట‌ను, ఉప్పును, అలాగే ఒక పూర్తి క‌మ‌లా పండు తొక్క‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా జార్ లో క‌మలా పండు తొక్క‌, ట‌మాట ముక్క వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేయాలి. త‌రువాత దీనిని బ్ర‌ష్ తో తీసుకుని దానిపై ఉప్పును చ‌ల్లి దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్ర‌మంతో 4 నుండి 5 నిమిషాల పాటు దంతాల‌ను శుభ్రం చేసుకుని ఆ త‌రువాత సాధార‌ణ టూత్ పేస్ట్ తో దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల దంతాలపై గార‌, ప‌సుపుద‌నం తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా మార‌తాయి. దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో వంట‌సోడా మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బ‌రి నూనె, పావు టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ తో తీసుకుని దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌తాయి.

Whiten Teeth very effective way to get rid of the problem
Whiten Teeth

అయితే ఈ చిట్కాను నెల‌కు రెండు సార్లు మాత్ర‌మే ఉప‌యోగించాలి. అలాగే సున్నిత‌మైన దంతాలు ఉన్న వారు ఈ చిట్కాను వాడ‌క‌పోవడ‌మే మంచిది. అదే విధంగా న‌ల్ల నువ్వులు కూడా దంతాల‌ను చ‌క్క‌గా శుభ్ర‌ప‌రుస్తాయి. దీనికోసం ముందుగా 2 లేదా 3 టీ స్పూన్ల న‌ల్ల నువ్వుల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మ‌లాలి. త‌రువాత బ్ర‌ష్ మీద 4 లేదా 5 చుక్క‌ల ల‌వంగం నూనెను వేసి దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై పేరుకుపోయిన గారె తొల‌గిపోతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల దంతాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

D

Recent Posts