Teeth Pain : పంటి నొప్పి అనేది మన జీవితకాలంలో చాలా బాధాకరమైన పరిస్థితి. అతి చల్లగా, వేడిగా లేదా పులుపుగా ఉన్న ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు నొప్పి మరింత తీవ్రమవుతుంది. పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఓవర్ ది కౌంటర్ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నొప్పి నుండి ఉపశమనానికి సహజ నివారణలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి. ఎందుకంటే ఈ హోం రెమెడీస్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ (OTC) ఔషధాల కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా సులభంగా అందుబాటులో ఉంటాయి. పంటి నొప్పికి తగ్గించే పాపులర్ హోం రెమెడీలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
బలహీనమైన నోటి పరిశుభ్రత మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు జామ ఆకులు శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో ఫ్లేవనాయిడ్లు, యాంటీ బాక్టీరియల్ యాక్టివిటీ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గించడానికి సరైన ఔషధం.
తాజా జామ ఆకులను పంటి నొప్పిని తగ్గించడానికి మరియు నోటి పుండ్లను కూడా నయం చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. పంటి నొప్పిని ఎదుర్కోవడానికి జామ ఆకులను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా మరియు శుభ్రమైన చిగురించే జామ ఆకులను తీసి నమలండి. తద్వారా దాని రసం పంటి ప్రభావిత ప్రాంతాని శుభ్రం చేసి పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
అదేవిధంగా పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు మరొక మార్గం ఏమిటంటే.. పది తాజా జామ ఆకులను అర లీటర్ నీళ్లలో వేసి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి. ఆ త్వరగా ఉపశమనం పొందేందుకు ఉడికించిన నీటిలో కొంచెం ఉప్పు వేసి, మౌత్ వాష్‌గా పుక్కిలించండి. చేయడం వల్ల నోరు పరిశుభ్రంగా నోటి పరిశుద్ధంగా ఉండటంతో పాటు పంటి సమస్యలు కూడా దరిచేరవు. పంటి నొప్పి నుండి ఉపశమనానికి జామ ఆకులు ఎఫెక్టివ్ హోం రెమెడీ అయినప్పటికీ, పంటి నొప్పి కొనసాగితే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందడం ఉత్తమం.