హెల్త్ టిప్స్

వెల్లుల్లిని ఇలా మాత్రం తిన‌కండి.. ఎందుకంటే..?

సాధార‌ణంగా వెల్లుల్లి తెలియ‌న వారు.. రుచి చూడ‌ని వారు ఉండ‌రేమో. వెల్లుల్లి వాసన డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా? కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. వెల్లుల్లిలో అధిక మొత్తంలో రసాయనాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడుతాయని పరిశోధనలు చెబుతున్నారు.

అయితే ఎన్నో ఆరోగ్యప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.. వెల్లుల్లి వ‌ల కూడా సైడ్ ఎఫెక‌ట్స్ ఉన్నాయి. ఎలా అంటే.. వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన లివర్ పనితీరు దెబ్బతినవచ్చు. లివర్ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కొన్ని ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ఈ విష‌యం బ‌య‌టప‌డింది. పచ్చి వెల్లుల్లిని మరీ ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ హెల్త్ పై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. వెల్లుల్లి వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వెల్లుల్లిని ఆహారంలో మితంగా వాడాలి.

do not take garlic like this

అలాగే, వాటిని పచ్చిగా తినడాన్ని అవాయిడ్ చేయాలి. అతిగా పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వలన స్కిన్ ఇరిటేషన్ కి గురికావచ్చు. ఎందుకంటే వెల్లుల్లిలో అల్లీయిన్ ల్యాస్ అనే ఎంజైమ్ కలదు. ఇది స్కిన్ ని ఇరిటేషన్ కి గురిచేస్తుందని గుర్తించాలి. వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన కంటి చూపులో తేడా రావచ్చు. హైఫెమా అనే కండిషన్ కు దారితీయవచ్చు.

Admin

Recent Posts