Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

ఉప్పు వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఈ 11 లాభాల గురించి తెలుసా..?

Admin by Admin
January 30, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మ‌న శ‌రీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దాంతో కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బీపీ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్స్ వ‌స్తాయి. ఇంకా చాలా అనారోగ్యాలే మ‌న‌ల్ని బాధిస్తాయి. అయితే ఇవ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా క‌లిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగ‌తా విష‌యాల్లో చూస్తే ఉప్పు మ‌న‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో మ‌నం ప‌లు ఇబ్బందుల‌ను ఇట్టే దాటేయొచ్చు. ప‌లు వ‌స్తువుల‌ను క్లీన్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఉప్పు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌ర్మంపై ఉన్న మృత క‌ణాల‌ను తొల‌గించేందుకు ఉప్పు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు ఉప్పు వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే స్నానం చేశాక కొద్దిగా ఉప్పును తీసుకుని మోచేతులు, మోకాళ్లు, ఇంకా ఇత‌ర న‌ల్ల‌గా ఉన్న ప్ర‌దేశాల్లో ఉప్పును రుద్ది ఆ త‌రువాత క‌డిగేయాలి. దీంతో అక్క‌డ ఉన్న చ‌ర్మ మృత క‌ణాలు పోతాయి. ఆ భాగాల్లో చ‌ర్మం మృదువుగా మార‌డ‌మే కాదు, కాంతివంతంగా కూడా అవుతుంది.

ఉప్పు వేస్తే మంట‌ను ఇట్టే ఆర్పేయ‌వ‌చ్చు తెలుసా.! మంట బాగా ఉంటే దాన్ని త‌గ్గించేందుకు లేదా ఆర్పేందుకు దానిపై కొంత ఉప్పు వేస్తే చాలు, మంట ఇట్టే అదుపులోకి వ‌స్తుంది. ఒక కప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మంలో ఒక శుభ్ర‌మైన గుడ్డను ముంచి దాంతో క‌ళ్ల‌పై మ‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల క‌ల‌క‌, వాపులు త‌గ్గుతాయి. కోడిగుడ్ల‌ను తెచ్చి బాగా రోజులు అవుతుందా..? అవి మంచిగా ఉన్నాయో, కుళ్ళి పోయాయో తెలియ‌డం లేదా..? అయితే ఏం లేదు, సింపుల్‌గా ఓ గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి బాగా క‌ల‌పండి. అనంత‌రం ఆ మిశ్ర‌మంలో గుడ్ల‌ను వేయండి. ఒక వేళ గుడ్డు మునిగిపోతే అది మంచిదే అని లెక్క‌. లేదంటే గుడ్డు ఆ నీటిపై తేలితే అది కుళ్లిపోయినట్టు నిర్దారించుకోవాలి.

do you know these benefits about salt

వెండి, రాగి వ‌స్తువులు బాగా మాసిన‌ట్టు అయ్యాయా..? అయితే వాటిని ఉప్పుతో తోమి చూడండి. త‌ళ‌త‌ళా మెరుస్తాయి. ఇస్త్రీ పెట్టెపై గోధుమ రంగు చిలుం మ‌చ్చ‌లు ప‌డ్డాయా..? అయితే దిగులు చెంద‌కండి. ఒక బ్రౌన్ పేప‌ర్‌పై కొంత ఉప్పు వేసి అనంత‌రం దాన్ని ఐర‌న్ చేయండి. దీంతో ఇస్త్రీ పెట్టెపై ఉన్న మ‌చ్చ‌లు పోతాయి. మూడు భాగాల్లో రెండు భాగాలు బేకింగ్ సోడా, ఒక భాగం ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మంతో ప‌ళ్లు తోముకుంటే దంతాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి. ఆలుగ‌డ్డ‌లు, యాపిల్స్‌ను కట్ చేశాక అవి గోధుమ రంగులోకి మారుతాయి. అలా కాకుండా ఉండాంటే ఆ ముక్క‌ల‌ను కోసిన వెంట‌నే ఓ పాత్ర‌లో చ‌ల్ల‌ని నీటిని తీసుకుని అందులో కొంత ఉప్పు వేయాలి. ఆ త‌రువాత పాత్ర‌లో ఆ ముక్క‌లు వేస్తే అవి రంగు మార‌కుండా ఉంటాయి.

సోడా నీటిలో కొంత ఉప్పు వేసి ఆ మిశ్ర‌మంతో ఫ్రిజ్ లోప‌లి భాగం క్లీన్ చేస్తే అది త‌ళ త‌ళా మెరుస్తుంది. ఫ్రిజ్‌లో వ‌చ్చే దుర్వాస‌న పోతుంది. స‌హ‌జ సిద్ధ‌మైన పూలు కాకుండా ప్లాస్టిక్ పూలను కూడా చాలా మంది ఇంట్లో అలంక‌ర‌ణ కోసం వాడుతారు. అయితే అవి రాను రాను మాసిపోతాయి. తిరిగి వాటిని మెరిసేలా చేయాలంటే ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి దాంతో పాటు ఆ పూల‌ను కూడా ఆ బ్యాగ్‌లో వేయాలి. అనంత‌రం ఆ బ్యాగ్‌ను బాగా షేక్ చేయాలి. దీంతో ఆ పూలు మ‌ళ్లీ మెరుస్తాయి. తేనెటీగ కుట్టిన ప్ర‌దేశంలో నొప్పి, మంట ఉంటాయి. కొంద‌రిలో ద‌ద్దుర్లు కూడా వ‌స్తాయి. అయితే ఆ బాధ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల‌గాలంటే ఆ ప్ర‌దేశంలో కొద్దిగా నీరు పోసి దాన్ని అలాగే ఉంచి కొద్దిగా ఉప్పు పెట్టాలి. అనంత‌రం గుడ్డ‌తో క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేస్తే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Tags: salt
Previous Post

మిణుగురు పురుగు నుండి కాంతి ఎందుకు వస్తుందో మీకు తెలుసా..?

Next Post

డబ్బు సంపాదించాలని చూస్తున్నారా..? అయితే ఈ 11 బిజినెస్‌ ఐడియాలు మీ కోసమే..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!