Home Tips

వాహ‌న టైర్ల‌లో ఏ గాలి కొట్టించాలి.. నైట్రోజ‌న్ ఎయిరా..? లేక నార్మ‌ల్ ఎయిరా..?

ఇటీవ‌లి కాలంలో కారు వాడకం బాగా పెరిగింది. కామన్ మెన్ నుంచి కరోడ్ పతీ వరకు వారి వారి స్థాయిల్లో ఏదో కారును మెయిన్ టెన్ చేస్తున్నారు.ఎక్క‌డికి పోవాల‌న్నా కూడా కార్ల‌లోనే వెళుతున్నారు. అయితే లాంగ్ జర్నీ వెళుతున్న‌ప్పుడు మ‌న‌కి ప్ర‌ధాన‌మైన‌ది టైర్లు. ఈ రోజుల్లో చాలా మంది టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ గాలిని ఎంచుకుంటున్నారు. అయితే ఇది కారు చక్రాలకు నిజంగా మంచిదేనా? లేక తెలియకుండానే ప్రమాదమా జరుగుతుందా?టైర్లకు నైట్రోజన్ గాలిని నింపడం వల్ల టైర్ల జీవితకాలం పెరుగుతుంది. అంతేకాదు వాహనానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ గాలితో పోలిస్తే ఈ నైట్రోజన్‌ గాలి నింపడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి టైర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంటే, ఈ గాలి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

నైట్రోజ‌న్ గాలి నింప‌డం వ‌ల‌న కార్ మైలేజ్ పెరుగుతుంది.సాధారణ గాలి నింపితే కారు టైరు త్వరగా డీఫ్లేట్ అవుతుంది.అంటే ప్రతి ద్రవ్యోల్బణం తరువాత టైర్లోని గాలి పీడనం తగ్గుతుంది.ఇలా జరిగితే టైర్ పై ఒత్తిడి పడుతుంది. దీంతో కార్ మైలేజ్ తగ్గుతుంది.ఒకవేళ కారులో నైట్రోజన్ గాలి నింపితే మైలేజ్ సమస్య ఉండదు. కారు అధిక దూరం ప్రయాణిస్తే కారు టైర్ లో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది.దీంతో కొన్ని సందర్భాల్లో కారు టైరు పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.అటువంటి పరిస్థితులలో నైట్రోజన్ గాలి ఉపయోగించడం వల్ల కార్ టైర్ లోని టెంపరేచర్ ను మెయింటైన్ చేసి, కార్ టైర్ జీవిత కాలం పెంచవచ్చు.కారులో సాధారణ గాలి నింపాలంటే ఎలాంటి ఖర్చు ఉండదు.కానీ నైట్రోజన్ గాలి నింపాలంటే ఒక్కో టైరుకు రూ.20 ఖర్చు అవుతుంది.

filling nitrogen air in tyres is it better

మన దేశంలో సాధారణ గాలి నైట్రోజన్ కంటే చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. భారతీయ వాహన డ్రైవర్లు రోడ్డుపై ఎదుర్కొనే సవాళ్లను నైట్రోజన్ సులభంగా ఎదుర్కోగలదని కూడా చెప్పవచ్చు.మనం కారు చక్రాలలో నైట్రోజన్ గాలి నింపాలంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాలి. అదే మాములు గాలి నింపితే ఖర్చు తక్కువ అందుకే ఎక్కవ మంది నైట్రోజన్ గాలి ఎక్కువగా ఫ్రిఫర్ చేయరు.అయితే నైట్రోజన్ గాలి నింపిన టైర్లు సమ్మర్ లో ఒత్తిడిని నియంత్రించడం వల్ల పేలిపోయే అవకాశం కూడా చాలా తక్కువ.

Share
Sam

Recent Posts