దోసెలు వేసి తీసేప్పుడు దోసె పాన్‌కు అంటకుండా రావాలంటే ముందు రోజు రాత్రి పాన్‌కి నూనె రాసి ఉంచుకోవాలి. బంగాళదుంపల చిప్స్ తయారు చేసేముందు నూనెతో చిఒటికెడు ఉప్పు వేసి ముక్కలు వేపుకుంటే చిప్స్ కరకరలాడతాయి. పిల్లలు స్కూల్‌కి పెట్టిన లంచ్ మొత్తం తిని ఖాళీ బాక్సు తెచ్చిన రోజు వాళ్ల రూంలో ఉన్న క్యాలెండర్‌లో స్టార్ ఇవ్వండి. ఇలా చేస్తే క్యాలెండర్‌లో ఎక్కువ స్టార్లు తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటుంటే స్వీట్ల స్ధానంలో బాదం మొదలైన డ్రైఫ్రూట్స్ చేరిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల లంచ్ బాక్సుతోపాటు వారానికి ఒకటి రెండు సార్లు మంచినీళ్ల బాటిల్‌లో నిమ్మరసం పెట్టారనుకోండి. తాగినప్పటి నుంచి ఇంటికి వచ్చి ఎందుకిలా సర్‌ప్రైజ్ చేశావంటూ అమ్మనడగడంలోనూ ధ్రిల్ ఫీలవుతారు.
పిల్లల లంచ్ బాక్సులో వెల్లుల్లి వంటి వంట పదార్ధాల వాసన పట్టిస్తే రసం పిండేసిన నిమ్మ చెక్క వేసి రాత్రంతా ఉంచితే తాజాగా మారుతుంది. వంట చేస్తూనే పిల్లలచేత వాళ్లు చెయగలిగిన సాయం చేయించుకుంటూ వారికి కొత్త విషయాలు చెబుతుంటే ఆసక్తిగా వింటూ చెప్పిన పని చేస్తారు. ఇంటి పనులేంటో తెలుసుకుంటారు. నిజానికి పిల్లల సహాయం కోసం ఎదురు చూస్తూ వంట చేయడం ఆలస్యమవుతున్నా తల్లులు భరించాలి. ఫర్నిచర్ మీద పడిన మచ్చలు, గీతలను తొలిగించాలంటే బూడిదలో వెనిగర్ కలిపి ఆపేస్టుతో రుద్దాలి. నీటిలో టీ పొడి వేసి మరిగించి చిక్కటి ద్రావణంలో క్లాత్‌ను ముంచి తుడిస్తే ఏరకమైనా ఫర్నిచర్ అయినా శుభ్రపడుతుంది. టేబుల్ డ్రాలు కాని వార్డ్రోడ్ తలుపులు కాని తీసేటప్పుడు, వేసేటప్పుడు పట్టేస్తుంటే చక్రాలకు మైనం కాని సబ్బుకాని రాయాలి.
ఆలీవ్ ఆయిల్‌లో అంతే మోతాదులో వెనిగర్ కలిపి తుడిస్తే ఫర్నీచర్ కొత్తవాటిలా మెరుస్తుంది. ఫర్నీచర్ మీదపడిన మరకలను షూ పాలిష్‌తో తుడిస్తే పోతాయి. షూస్ వాసన వస్తుంటే చిటికెడు ఉప్పును లోపల చల్లి ఒక రోజంతా గాలికి ఆరనివ్వాలి. రోజూ వాడకుండా అరుదుగా వాడే షూస్ లోపల చిన్న ఉప్పు మూట వేయాలి. అక్వేరియంలో గోల్డ్‌ఫిష్ ఉన్నట్లయితే దానిని అప్పుడప్పుడూ ఉప్పు నీటిలో వదలాలి. ఒక పాత్రలో శుబ్రమైన నీటిని తీసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు కలిపి అందులో పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత అక్వేరియంలో వదలాలి. ఉప్పు నీటిలో ఈదినట్లైయితే చేప ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్లవర్ వేజ్ లోపల క్లీన్ చేయాలంటే కష్టం.నీరు నిలువ ఉండడం వల్ల గార జిగటగా పట్టేస్తుంది. అలాంటప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి సబ్బు నీటిని పోసి బాగా షేక్ చేయాలి. ఇలా రెండు మూడు సార్లు నీటిని మారుస్తూ మరలా ఉప్పు వేస్తూ శుభ్రం చేయాలి.
ఉల్లిపాయ ముక్కలను వేయించేటప్పుడు ఒక స్పూను పాలు కలిపితే ముక్కలు నల్లగా మాడిపోకుండా వేగుతాయి. పన్నీరు ముక్కలను నీటితో ఉడకబెట్టకుండా, వాటిని వేడి నీటిలో వేసి, కొద్దిసేపు ఉంచి నీటిని వార్చేస్తే అవి మెత్తగా దూదిముక్కల్లా ఉంటాయి. నూడుల్స్‌ని ఉడకబెట్టిన తరువాత వేడినీటిని వార్చి వాటిని చల్లని నీటిలో వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోకుండా విడివిడిగా అవుతాయి. పచ్చిగా ఉన్న అరటిపళ్ళను ఆపిల్స్‌తో కలిపి పెడితే త్వరగా పండుతాయి. వర్క్ ఏరియా, పిల్లలు ఆడుకునే ప్లేస్, చదువుకునే స్థలం ఏదైనా ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ని క్రియేట్ చేయాలంటే మంచి చాయిస్ వాల్‌పేపర్స్.