FSS- Food Saftey Security Packaging & Labelling Regulations, 2011ప్రకారం తినడానికి, తాగడానికి ఉపయోగించే ఆహార పదార్థాల మీద దాని తయారీ తేది, దాని గడువు తేది ముద్రించబడి ఉండాలి. అయితే తక్కువ కాలం నిల్వ ఉండే వస్తువుల విషయంలో కొన్ని కంపెనీలు డేట్స్ జిమిక్స్ చేస్తున్నాయి. ఈ రోజు తయారైన వస్తువుకు రేపటి తేదిని ముద్రిస్తున్నాయి. గతంలో అటువంటి సంఘటనే కరాచీ బేకరీ ప్రొడక్ట్ అయిన మిల్క్ బ్రెడ్ విషయంలో జరిగింది. హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కరాచీ బేకరీలో ఓ వినియోగదారుడు 4వ తేదీ ఓ బ్రెడ్ పాకెట్ ను కొనుగోలు చేశాడు. దాని మీద చూస్తే ప్యాకింగ్ డేట్ 5వ తేది అని ముద్రించబడి ఉంది. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యి సదరు సంస్థ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడింగ్ చేసి కేసులు నమోదు చేశారు!
వాస్తవానికి బ్రెడ్ ఎక్స్పైరీ 4 రోజులు ఉంటుంది. 4 వ తేదీన తయారు చేస్తే….4 రోజులు అంటే 8 వ తేదీ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిందేంటంటే…..ఒక రోజు ముందటి డేట్ ను ప్యాక్డ్ డేట్ గా ప్రింట్ చేశారు అంటే…. 9 వ తేదీ వరకు దాని గడువు తేది ఉంటుంది! ఇలా తమ ప్రొడక్ట్ గడువును ఒకరోజును పొడగించుకుంది.! ఈ లాజిక్ వల్ల కంపెనీలు లాభం పొందుతాయి, కానీ ఆ ప్రొడక్ట్స్ ను తిన్న మనుషుల ప్రాణాలే పోతాయి.!!!
పాల ప్యాకెట్స్, పెరుగు ప్యాకెట్స్ విషయంలో ఈ పోస్ట్ ప్రింటింగ్ డేట్స్ జిమ్మిక్స్ చాలా కనిపిస్తుంటాయి. పాల విషయానికి వస్తే ప్యాకెట్ పాలు 2 రోజుల వరకు ఎక్స్పైరీ ఉంటుంది,.( అది కూడా 4 డిగ్రీల సెల్సియల్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిప్రిజిరేటర్ లో ఉంటేనే)
కూల్ డ్రింక్స్…వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగానే కూల్ డ్రింక్స్ మన ఆరోగ్యానికి హానికరం ఇంకా డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ అయితే విషంతో సమానమే…. వీటి ఎక్స్పైరీ దాదాపు 4 నెలలు ఉంటుంది. ( అది కూడా 4 డిగ్రీల సెల్సియల్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిప్రిజిరేటర్ లో ఉంటేనే).