information

పాకిస్థాన్ కు ఇండియాకు గొడ‌వ ఎక్క‌డి నుండి స్టార్ట్ అయ్యింది.!

మ‌న దేశ అగ్ర‌భాగాన ఉన్న రాష్ట్రం జ‌మ్మూ కాశ్మీర్‌. అనేక ప్ర‌కృతి అందాలకు అది నెల‌వుగా ఉంటుంది. అయితే అందులో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్ర‌మించింది. దీంతో ఆ భాగాన్ని పాకిస్థాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు. ఆ భాగానికి మ‌న దేశంలో ఉన్న భాగానికి మ‌ధ్య ఎల్వోసీ ఉంటుంది. దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అయితే నిజానికి ఈ ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్ర‌మించుకుంది ? అందుకు ముందు దీని స్థితి ఏమిటి ? అది మ‌న దేశంలో ఉందా ? ఉంటే దాని వివ‌రాలు ఏమిటి ? అనే విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటిష్ వారు మ‌న దేశంలోని అనేక రాష్ట్రాల‌ను పాలించారు. కానీ కొన్ని మాత్రం వేరే రాజుల అధికారంలో ఉండేవి. అలాంటి రాష్ట్రాల్లో జ‌మ్మూ కాశ్మీర్ కూడా ఒకటి. అయితే 1947, ఆగ‌స్టు 15న మ‌న‌కు స్వాతంత్ర్యం ల‌భించాక జ‌మ్మూ కాశ్మీర్‌ను కూడా భార‌త్ లో విలీనం చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే అంత‌కు ముందు వ‌ర‌కు ఆ రాష్ట్రాన్ని పాలించిన మ‌హారాజ హ‌రి సింగ్ ఆ రాష్ట్రాన్ని ప్ర‌త్యేక దేశంగా చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నారు. కానీ అది కుద‌ర‌లేదు. ఈ క్ర‌మంలోనే జ‌మ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనం అయింది. దీన్ని చూసి త‌ట్టుకోలేని పాక్ జ‌మ్మూ కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్ర‌మించింది. అందులో భాగంగా పాక్ భార‌త్‌తో యుద్ధం కూడా చేసింది. అయితే ఐక్య‌రాజ్య స‌మితి క‌ల‌గ‌జేసుకుని కార్గిల్ వ‌ద్ద లైన్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసింది. దీంతో దానికి అవ‌తల ఉన్న భాగం మొత్తం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌గా మారింది. దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (పీవోకే) అని పిలుస్తున్నారు.

india and pakistan where the quarrel started

ఇక పీవోకే లో ముజ‌ఫ‌రాబాద్ వ‌ద్ద రాజ‌ధాని ఏర్ప‌డింది. మొత్తం ఆ ప్రాంతం 13,297 చ‌ద‌రపు కిలోమీట‌ర్ల విస్తీర్ణాన్ని క‌లిగి ఉంది. అక్క‌డ మొత్తం 4.6 కోట్ల జ‌నాభా ఉంది. అయితే స్వాతంత్ర్యం అనంత‌రం జ‌మ్మూ కాశ్మీర్‌ ఇండియాలో అక్టోబ‌ర్ 26 న క‌లిశాయి. దీంతో ఆ రోజును Accession Day అని పిలుస్తున్నారు. కానీ అక్క‌డి కొంద‌రు మాత్రం దీన్ని బ్లాక్ డేగా పాటిస్తున్నారు. వారు దాన్ని జ‌రుపుకున్నారు కూడా. ఇక ఆ ప్రాంతంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంది. అయితే 1963లో పాక్ పీవోకేలోని కొంత భాగాన్ని చైనాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇక పీవోకేకు అధ్య‌క్షుడు, ప్రైమ్ మినిస్ట‌ర్‌లు కూడా ఉన్నారు. ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు సొంత సుప్రీం కోర్టు కూడా ఉంది. ఆజాద్ కాశ్మీర్ రేడియో పేరిట అక్క‌డ ఓ రేడియో స్టేష‌న్ ఏర్పాటు చేశారు. ఇక చివ‌రిగా పీవోకే గురించిన ఇంకో విష‌యం ఏమిటంటే… మ‌న దేశంలో మ‌న‌కు ఉన్నంత వాక్ స్వాతంత్ర్యం అక్క‌డ ఉండ‌దు. ఎందుకంటే ఎవ‌రైనా ప్ర‌భుత్వ వ్య‌తిరేకంగా మాట్లాడితే వారి గొంతు నొక్కుతుంది. దీనికి పాకిస్థాన్ స‌పోర్టు కూడా ఉంది. ఇవీ… పీవోకే గురించిన విశేషాలు..!

Admin

Recent Posts