చాలా మంది ATM లలో డబ్బులు డ్రా చేసాక వచ్చిన రిసిప్ట్స్ చూసి వాటిని నలిపి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో వేస్తారు, కానీ ఇలా చెయ్యడం వలన మనకు నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంటాయి, అవేంటంటే.. ఒక సారి డబ్బులు డ్రా చెయ్యాలనుకుంటే ఏదైనా సిస్టం లోపం వలన అకౌంట్ లో డబ్బులు కట్ అయి ATM నుండి డబ్బులు రాకుంటే మనకు వచ్చే స్లిప్ యే మనకి ఆధారం, ఆ స్లిప్ మూలంగా, సీసీటీవీ ఫుట్ ఏజ్ ఆధారంగా బ్యాంకు అధికారులు విచారించి మన డబ్బులు మనకి తిరిగి ఇస్తారు. మిమ్మల్ని ఫాలో అయ్యే దొంగలు, మీరు పడేసిన రిసిప్ట్ లో మీ బ్యాంకు బ్యాలన్స్ చూసి మీ వెమ్మటి పడే అవకాశాలు చాలా ఉన్నాయ్, కనుక జాగ్రత్తగా ఉండాలి, మీ అకౌంట్ నెంబర్ మొత్తం పేపర్ మీద డిస్ ప్లే అవ్వదు, కానీ కొన్ని నంబర్స్ తెలిసినా హ్యాకర్స్ మీ అకౌంట్ నెంబర్ మొత్తం తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు, ఆ తరువాత మీ అకౌంట్ నుండి డబ్బులు మాయం చేస్తారు.
మీకు రిసిప్ట్ కావాలా వద్దా అని ATM అడిగినప్పుడు నో అని ప్రెస్ చేస్తారు చాలా మంది, అమౌంట్ డ్రా చేసుకునే వాళ్ళైతే రిసిప్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, మిగిలిన వాటికి అయితే రిసిప్ట్ లు తీసుకోకండి, ఇప్పుడు మొబైల్ లోనే బ్యాలన్స్ చూసుకొనే సదుపాయం ఉండటం తో అందులోనే మీ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోడం ఉత్తమం.
ఇవ్వాళా రేపు బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్ళు మొబైల్ నెంబర్ లింక్ కంపల్సరీ చేయించుకుంటున్నారు, కానీ వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ కే లింక్ చేయించుకోండి, ఒక వేళ వేరే నెంబర్ మారిస్తే బ్యాంకు కి వెళ్లి ఆ నెంబర్ ని మార్పియ్యండి, ఇలా చెయ్యడం ద్వారా ఏ చిన్న విషయం జరిగిన మీ అకౌంట్ కి సంబంధించి, మీకు మెసేజ్ వస్తుంది.