భారతదేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్న సమంత ప్రస్తుతం హనీబన్నీ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో మాఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత ఒంటరిగానే జీవిస్తున్న సమంత మయోసైటిస్ కు గురవడంతో ఏడాదిన్నరకు పైగా సినిమాలకు విరామం ప్రకటించింది. తర్వాత సినిమాల్లో ఆఫర్లు రావడంలేదని బహిరంగంగానే చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న సమంతకు పలుసార్లు ఎదురైనప్పటికీ చేసుకోనని, ఆ ఉద్దేశం లేదని, ఒంటరిగానే జీవిస్తానని చెబుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరలవుతోంది. బాలీవుడ్ హీరోతో ప్రేమాయణంలో ఉందని, త్వరలోనే ఆ హీరోను వివాహం చేసుకొని వారి ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టబోతోందనేది ఆ వార్త సారాంశం. ఆ హీరో ఎవరో కాదు.. ఇటీవలి వరకు మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిన అర్జున్ కపూర్. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొడుకైన అర్జున్ కపూర్ ఇటీవలే మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పాడు. ఆ బ్రేకప్ చెప్పడానికి కారణం సమంతను వివాహం చేసుకోవాలన్న నిర్ణయమే అన్నది వైరలవుతున్న వార్త సారాంశం. మలైకాతో విడిపోయిన కొద్ది రోజులకే అర్జున్ కపూర్ సమంతతో ప్రేమలో పడ్డాడని, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సమంత తన అకౌంట్ లో ఓ మంచి కవితను షేర్ చేసింది. దీనికి అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. ఈ కవిత చాలా ఆదర్శనీయంగా ఉందన్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పుడు కాదని, గతం నుంచే పరిచయం ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. సాధారణంగా అర్జున్ కపూర్ ఆ పోస్ట్ కు రిప్లై ఇచ్చారా? లేదంటే గతం నుంచే వీరిమధ్య పరిచయం ఉందా? పెళ్లి విషయం నిజమేనా? ఎప్పుడు జరగుతోంది? అనే విషయాలపై స్పష్టత రావాలనే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అర్జున్ కపూర్ ను సమంత పెళ్లి చేసుకోబోతోందనే వార్త మాత్రం సామ్ అభిమానులకు షాక్ తగిలినంతపనైంది. అర్జున్ కపూర్ కాకుండా మరే హీరో దొరకలేదా? అతనితో పెళ్లి వద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సమంత ఏం చేస్తుందో చూడాలి.