information

SIP Plan : రూ.10వేలు పెడితే రూ.2 కోట్లు వ‌స్తాయి.. ఎలాగంటే..?

SIP Plan : ప్రతి ఒక్కరు కూడా, భవిష్యత్తు బాగుండాలని, ఇప్పుడు కష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండడానికి, ఇప్పటినుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కనుక ముందు చూపు ఉండి, ప్లాన్ చేసుకున్నట్లయితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. రిటైర్ అయిన తర్వాత కూడా, సురక్షితంగా జీవించొచ్చు. SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో మంచిది. పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, ఇది ఒక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు.

తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే, ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. SIP లో మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆర్థిక స్థిరత్వం మార్గాన్ని అందిస్తాయి. నెల వారి పెట్టుబడి తో, కేవలం రూ.10,000 ని మీరు పెట్టవచ్చు. మీ బిడ్డకు 21 ఏళ్ళు వచ్చేసరికి, రెండు కోట్లు వస్తాయి. అయితే ఇందులో మీరు స్థిరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

invest rs 10000 in sip get rs 2 crores

ఇలా చేయడం వలన, పిల్లలకి 21 వచ్చేటప్పుడు 25 లక్షలు వాళ్లకి ఇస్తారు. ఎస్ఐపి పెట్టుబడులపై సగటున 16% రాబడిని పొందగలిగితే, 21 సంవత్సరాలు ముగింపులో రెండు కోట్లు వస్తుంది. ఈ గణనీయమైన మొత్తం, మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మంచి అవకాశం. 25 లక్షల మొత్తం పెట్టినట్లయితే, 21 ఏళ్ళ కి, 1.81 కోట్లకు చేరుతుంది.

దీంతో మీ పిల్లల పెళ్లిళ్లు లేదంటే చదువులు వంటి వాటికి అస్సలు సమస్య ఉండదు. ఎంచుకున్న ఫండ్ల ఆధారంగా, ఎస్ఐపి రాబడి మారవచ్చు. ఐసిఐసిఐ ప్రోడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ 21% వరకు రాబడి అందించింది. 12 శాతం రాబడిని పొందినట్లయితే 88.66 లక్షల ప్రారంభ పెట్టుబడి పై 25.20 లక్షలు ఫలితంగా మొత్తం 1.13 కోట్ల లాభాలు వచ్చాయి. ఇలా, ఇన్వెస్ట్ చేసి, మంచిగా ఆదాయాన్ని పొందవచ్చు.

Share
Admin

Recent Posts