మన రాజ్యాంగం పోలీస్ వ్యవస్థకి దాదాపుగా అపరిమితమైన అధికారాలు ఇచ్చింది.. సరిహద్దులు కాపలా కాసే సైనికుడికి, శాంతిభద్రతలు కాపాడే పోలీస్ లకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అధికారం ఉంది.. కానీ దురదృష్టవశాత్తూ అటువంటి అరుదైన అధికారాన్ని దుర్వినియోగపరిచే రక్షక భటులే ఎక్కువగా కనిపిస్తున్నారు.. సబ్ ఇన్స్పెక్టర్ అంటున్నారు కనుక, వారి పై అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేయవచ్చు.. కానీ ఆ శాఖ వారు సాధారణంగా వాడే పదం మన డిపార్ట్మెంట్ వాడు, సదరు సిఐ మరీ పెద్దమనిషి, డిపార్ట్మెంట్ పక్షపాతం లేనివాడైతే తప్ప మీకు న్యాయం జరిగే శాతం కేవలం 1%.. ఎస్పీ , ఐజి, డీజీపీ అంటూ hierarchy ప్రకారం ఓపికగా ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్తే ఒక 5-10% అవకాశం ఉండొచ్చు..
రాజకీయంగా పలుకుబడి ఉంటె, అధికార పార్టీ అండ ఉంటె మాత్రం మీరు ఖచ్చితంగా న్యాయం ఆశించవచ్చు.. కానీ ఆ దారి రెండు వైపులా పదునున్న కత్తి, మీరు చాలా నష్టపోయి ఉంటె తప్ప, అటువైపు చూడకపోవడమే మంచిది.. ఈమధ్యన ప్రతి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ సెల్ అని తీసుకొచ్చారు, అందులో ఫిర్యాదు చేయవచ్చు.. ఈమధ్యన కొన్ని కేసుల్లో ఈ గ్రీవెన్స్ సెల్ వారు నిజాయతీ గా విచారణ చేసి, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, బాధితులకి పరిహారం అందించిన సంఘటనలు కొన్ని పత్రికల్లో వస్తున్నాయి.
ఇక సామాన్యుడికి మిగిలి ఉన్న ఏకైక అస్త్రం ప్రైవేట్ కేసు , ఇలా మీపై జరిగిన దాడిని వివరిస్తూ కోర్టు లో కేసు వేయవచ్చు.. అయితే instant coffee , instant noodles మాదిరి సత్వర న్యాయం ఆశించవద్దు.. సరైన సాక్ష్యాలు సంపాదించే ప్రయత్నం చేయండి, ఆ అధికారి చేయి దురుసు వల్ల ఇబ్బంది పడ్డ ఇతర బాధితుల్ని కూడా మీ న్యాయ పోరాటం లో భాగం చేసే ప్రయత్నం చేయండి..ఆవేశంతో చట్టాన్ని మాత్రం చేతిలోకి తీసుకోకండి.. ఓపికతో న్యాయ పోరాటం చేయండి,.. సత్యమేవ జయతే..