గుజరాత్ కి చెందిన వ్యక్తి ఇంటి బయట ప్రతి రోజులు వీధి కుక్కలు అరుస్తుండడం తో విసిగిపోయిన ఆ ఇంటీ ఓనర్ అసలు బయట ఏం జరుగుతుంది. ఇందుకు ఈ కుక్కలు ప్రతి రోజూ ఇలా అరుస్తున్నాయి అని తెలుసుకోవడానికి అతని ఇంటిబయట సీసీ కెమెరా ఫిట్ చేశాడు.. ఆ తర్వాత రోజు ఉదయం సీసీటీవీ లో రికార్డు అయిన ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు వ్యక్తి.. ఎందుకంటే అతను కొద్ది రోజుల ముందే కొన్న ఇంటి ముందు కట్టేసిన ఆవు దగ్గరికి ఒక చిరుత రావడం.. వచ్చి ఆ అవుతో కాసేపు సరదాగా ఆడుకోవడాన్ని చూసి షాక్ అయ్యాడు.
చిరుత పులి ఆవుతో ఆడుకోవడం ఏంటి అని ఆశ్చర్య పోయిన ఆ వ్యక్తి ఆ ఆవు పాత యజమానినీ కలిసి ఆ అవుకి చిరుత కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ చిరుత పుట్టిన కొద్ది రోజులకే తన తల్లి వేటగాళ్ళతో చంపబడింది.. అప్పటికి పిల్ల వయసు 20 రోజులు మాత్రమే.. ఆ పిల్లని ఇంటికీ తీసుకొచ్చాడు ఆ ఆవు పాత యజమాని.
ఆ తర్వాత కొద్ది రోజుల వరకు ఆ ఆవే ఆ పిల్లకి పాలిచ్చి పెంచింది.. సొంత బిడ్డలా చూసుకుంది.. ఇక పిల్ల కొంచెం పెద్దయ్యి పులయ్యాక ఉర్లో ఉంటే ప్రమాదం అని అడవిలో వదిలేశాడు ఆ వ్యక్తి.. అప్పటి నుండి ప్రతి రోజూ రాత్రి సమయంలో ఆ చిరుత ఆవు దగ్గరికి వచ్చి ఆ అవునే తన అమ్మ లా భావించి కాసేపు సరదాగా అడుకొని అక్కడే పడుకొని ఉదయం అవ్వగానే తిరిగి అడవికి వెళ్ళిపోతుందని తెలిసింది.. చిన్నప్పుడు కథల్లో విన్నాం ఆవు పులి కథ.. ఇది నిజంగా జరిగిన కథ.. దానికి సంబంధించిన అధారాలే ఈ ఫోటోలు.