యాంకర్ సుమ 22 మార్చి 1975లో త్రిసూర్ కేరళలో జన్మించారు. టాలీవుడ్ టాప్ యాంకర్, యాంకరింగ్‌తో పాటు నటన, నిర్మాత, సింగర్‌గా బహుముఖ ప్రజ్ఞ. యాంకర్ సుమ 1996లో దాసరి నారాయణ రావు దర్శక, నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం. హీరోగా అతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత సుమ కనకాల మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర ప్రేమలో బాలయ్య చెల్లెలు పాత్రలో తిరిగి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు.
సినిమాల్లో హీరో చెల్లెలు పాత్రలు చేస్తూనే యాంకరింగ్ వైపు అడుగులు వేసి అక్కడ నెంబర్ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం తెలుగులో ఈమె నెంబర్ వన్ యాంకర్‌గా ఇప్పటికీ హవా చెలాయిస్తున్నారు. సుమ కనకాల తర్వాత ఎంతో మంది యాంకర్స్ వచ్చినా.. ఇప్పటికీ తెలుగు స్మాల్ స్క్రీన్ పై యాంకర్‌గా సుమ కనకాల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో యాక్టర్ రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహాం చేసుకున్నారు. సుమ కనకాల నటిగా పలు టీవీ సీరియల్స్‌లో నటించగా సుమ,రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈటీవీలో ప్రసారమయిన స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.