inspiration

డ‌బ్బుకు లోకం దాసోహం అనేది అందుకే.. స్నేహితులు కూడా శ‌త్రువులు అయిపోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సిరిపురంలో రాజా&comma; రంగాలవి పక్కపక్క ఇళ్లు&period; పక్కపక్క పొలాలూనూ&period; వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు&period; ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు&period; ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు&period; అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి&period; చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు&period; మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు&comma; నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు&period; అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే&period; అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు&period; ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా&period; మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు&period; కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది&period; ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా&period; ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా&period; ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు&period; మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే&period; అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు&period; ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే&period; మెరుపులా తప్పుకున్నాడు రంగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88574 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;friends&period;jpg" alt&equals;"two friends made enemies by money " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది&period; వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ&period; నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో&comma; ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను&period; నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌&quest; అన్నాడు రాజా చిరాకు పడుతూ&period; నీ దగ్గర దాపరికమెందుకు&quest; నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నఅన్నాడు రంగా నిజాయితీగా&period; ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు&period; ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా&period; ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి&period; వారితో కలిసి నడవసాగాడు&period; రాజా&comma; రంగాల మధ్య పాటలు&comma; కబుర్లు&comma; సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌&period; అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ&comma; ఆలోచనలు వారి కబుర్లు&comma; ఆనందాల్ని ఎలా అణిచేసిందో&comma; డబ్బుకు లోకం దాసోహం అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts