Off Beat

య‌ముడికి కొడుకు పుడితే.. స‌ర‌దాగా సాగే ఫ‌న్నీ క‌థ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు&period; ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది&period; వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు&period; ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి&period; పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది&period; ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు&period; కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు&period; కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది&period; ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి&comma; ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది&period; నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా&period; నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు&period; నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా&period; అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు&period; ఎందుకంటే వాళ్లకు చావు తప్పదన్నమాట అంటూ అదృశ్యమైపోయాడు&period; తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు&period; ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది&period; పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు&period; రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88578 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-yama&period;jpg" alt&equals;"what happens if lord yama has son funny story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు&period; ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు&period; ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది&period; రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు&period; కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది&period; వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ&comma; అమ్మా&excl; త్వరగా రా&period; నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ అరిచాడు&period; కొడుకు కేక వినగానే యముడికి చెమటలు పట్టాయి&period; గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు&period; దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది&period; రాకుమారిని పెళ్లాడి&comma; రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts