అంబానీ…ఆస్తులకు కేరాఫ్ అడ్రస్… ఇండియా మొత్తంలోని సంపాదనలో 15 శాతానికి పైగా అతని వద్దే ఉందంటే అతిశయోక్తి కాదు. తన ఆస్తులకు తగ్గట్టే తన అంతస్తుండాలని…. ముంబైలో 27 అంతస్తుల ఎంటిలియా భవనాన్ని నిర్మించాడు. ఇంతకు ముందు ముంబై వెళితే…. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడడానికి ఎగబడుతున్న జనాలు ఇప్పుడు అంబానీ 27 అంతస్తుల భవనం ముందు సెల్పీలు దిగుతున్నారు!!
ఇంతకీ ఏంటీ ఆ భవనం విశేషాలు అంటే.. ఈ భవనాన్నిభూకంపాన్ని తట్టుకునేలా నిర్మించారు. రిక్టర్ స్కేల్ పై 8 పాయింట్స్ గా నమోదైనా భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది. మొదటి నాలుగు ఫ్లోర్స్ కేవలం వారి ఖరీదైన కార్ల పార్కింగ్ కొరకు మాత్రమే ఉపయోగిస్తారు. పై అంతస్తులో హెలిప్యాడ్ ఉంది, ఏకకాలంలో మూడు హెలికాఫ్టర్లు ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చు. జిమ్, స్విమ్మింగ్ ఫూల్, బార్ అన్నీ ఇందులోనే ఉంటాయి. అంబానీ ఎంటిలియా భవనానికి నిరంతరం విద్యుత్ సరఫరా కోసం ఓ సెపరేట్ విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఉంది.ఓ ఫ్యామిలీ నివసించడానికి కట్టిన భవనంలో ప్రపంచంలోనే ఇదే అతి పెద్దది.
ఆ ఇంట్లో పని వాళ్లు, వాళ్ల జీతాలు ఇలా ఉన్నాయి. టోటల్ గా 600 మందికి పైగా పనివాళ్లు 24/7 అందులోనే ఉంటారు. ఆ కుటుంబ సభ్యులకు సేవలందిస్తారు. పనివారు రూ.10వేల నుండి రూ.2,00,000 వరకు జీతం తీసుకుంటున్నారు. హెడ్ కుక్ కు రూ.2 లక్షలు ఇస్తారు. ఇతని కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు, అతని ఖర్చులను అంబానీయే చూసుకుంటున్నాడు. కార్ డ్రైవర్ కు రూ.2 లక్షలు ఇస్తారు. ప్రతి ఉద్యోగికి-హెల్త్ ఇన్స్యూరెన్స్, PF లాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక అంబానీ ఇంటి చుట్టూ Z ప్లస్ సెక్యురిటీ ఉంటుంది. దీని ఖర్చు నెలకు 15 లక్షలు.
పండగ కానుకలు, బోనస్ లు అధనంగా ఇస్తారు. అన్నింటికి మించి పనిమనుషులను పనిమనుషులుగా కాకుండా సొంత మనుషులుగా చూసుకుంటారట. అందుకనే వారి దగ్గర పనిచేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.