సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు దర్శకులకు కూడా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఒక సినిమా విడుదల అవుతోంది అంటే దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని థియేటర్స్ కు వస్తున్నారు. ఇక ప్రస్తుతం అందరి చూపు పెద్ద దర్శకుల పైనే ఉంది. వారు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది. అయితే భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న 10 మంది తెలుగు దర్శకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ఇండియన్ సినిమాని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన దర్శక ధీరుడు, మన ఎస్ఎస్ రాజమౌళి ఒక్క సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
సుకుమార్ పుష్ప2 కి 40 నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని టాక్. మహేష్ బాబుతో ముచ్చటగా మూడోసారి జతకట్టిన గురూజీ ఇప్పుడు ఒక్క సినిమాకి 35 నుండి 40 కోట్లు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న కొరటాల సినిమాకి 25 నుంచి 30 కోట్లు తీసుకుంటున్నాడు. వారసుడుతో హిట్ కొట్టిన మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒక్క సినిమాకి 25 నుండి 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
అనిల్ రావిపూడి ఒక్క సినిమాకి 20 నుంచి 25 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఊర మాస్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దర్శకుడు పరశురాం బుజ్జి ఇప్పుడు సినిమాకి 10 నుండి 15 కోట్లు తీసుకుంటున్నాడు. సందీప్ చేసింది ఒకటి రెండు సినిమాలు అయినా పారితోషకం మాత్రం రెండు అంకెల్లో అంటే 10 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు అని టాక్. సురేందర్ రెడ్డి ఒక్క సినిమాకి గాను 5 నుండి 10 కోట్లు తీసుకుంటున్నాడు.