అన్న, చెల్లి లేదా అక్క, తమ్ముడు ఒకే బెడ్ మీద ఎందుకు పడుకోరాదు. సెక్సువల్ టెంప్టేషన్…. యుక్తవయసులో శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల సెక్సువల్ ఆకర్షణ పెరిగి, అనవసరమైన శృంగార ఆలోచనలు రావచ్చు. అనైతిక సంబంధాలు… ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల అనుకోకుండా జరిగే మర్మాంగ స్పర్శల వలన అసంకల్పిత సెక్స్ ప్రేరేపణలు కలిగి అసంకల్పిత, అనైతిక శృంగార చర్యలు ఏర్పడవచ్చు.. సమాజ దృష్టి….సమాజ దృష్టిలో ఇది మంచి ఆచారం కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం వారిలో ఏర్పడుతుంది.
తప్పనిసరి అయితే….. చిన్న ఇల్లు ఉండి, వేరే గదులు లేకపోతే, ఒకే బెడ్ మీద పడుకోవలసి వస్తే, మధ్యలో దుప్పటి లేక దిండు వేసుకొని పడుకోవడం మంచిది. ఒకరు అనారోగ్యం పాలయినప్పుడు, ఒంటరిగా పడుకోవడానికి భయం వేసినప్పుడు, ఒకే బెడ్ మీద పడుకోవడం తాత్కాలికంగా సరే. తప్పనిసరి అయితే ఇరువురి మధ్య దిండులను ఉంచాలి. వస్త్రధారణ మరియు శృంగార చర్యలపై జాగ్రత్త వహించాలి. బట్టలు మార్చుకొనే వ్యక్తిగత స్థలాలను పరదాతో వేరు చేయాలి.
తెలివిగా తగిన సమయంలో బాత్ రూముల వాడకం నేర్పాలి. చివరగా….ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే అనర్థాలే అధికం. కాబట్టి, యుక్తవయసులో ఉన్న అన్న, చెల్లి లేదా అక్క, తమ్ముడు ఒకే బెడ్ మీద పడుకోకుండా ఉండటం మంచిది. యుక్తవయసున్న ఆడబిడ్డతో తండ్రి, యుక్తవయసున్న కొడుకుతో తల్లి కూడా పడుకోరాదని నా మనవి….
గమనిక….. నా కౌన్సిలింగ్ నందు కూడా ఇలాంటి అవాంచనీయ దుర్ఘటనకు అబార్షన్ చేయించవలసి ఓ అన్యము పుణ్యము ఎరుగని ఓ అభాగ్యురాలికి. అన్నను దాదాపు ఆ అమ్మాయి పెళ్లి వరకు ఇంటికి దూరంగా ఉంచవలసి వచ్చింది. ఇది రేరెస్ట్ ఉదాహరణ అయినా జరిగే అవకాశం లేకపోలేదు.
— ఓ సైకియాట్రిస్ట్ స్వీయ అనుభవం.