హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయింది తనను వలచి వచ్చిన భామల్ని నిరాకరించడం వల్లనే అనే సంగతి మీకు తెలుసా? రాముడు రావణాసురునితో యుద్ధానికి తలపడింది కూడా శూర్పణఖని కాదన్నందుకే కదా! సరే ఈ కథలు హైస్కూల్ పిల్లలకి చెప్పి దీనివల్ల ఏంనీతి నేర్చుకున్నారని ప్రశ్నించండి. వాళ్ళు వెంటనే చెబుతారు అన్ని కష్టాలు పడేకంటే ఓకే చెబితే హాపీగా ఉండొచ్చు గా అంటారు.
వాళ్ళ ఆలోచనాపరిధి మేరకు ఆ సమాధానం కరెక్టే కానీ మనం వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే మంచిదేదో చెప్పాలి. రాముడు, హరిశ్చంద్ర లాంటి ఆదర్శపురుషులకి చేతనైనది మనకెందుకు చేతకావడంలేదని ప్రశ్నించుకొని అలా ఉండడానికి ప్రయత్నించాలి. సరే నాకెదురైన అలాంటి సందర్భాలు మూడు నాలుగున్నాయి. కానీ నేను ఆయా సందర్భాల్లో అసలేమీ తెలియనట్లు (నిజంగానే నాకపుడేమీ తెలియలేదు) మెల్లగా పక్కకి తప్పుకొన్నా అంటే కనీసం ఏం చర్చించకుండా.
ఐతే ఆ రోజు నేను ఏదైనా తప్పుచేశానా అనే ప్రశ్న కలుగుతుంది ఎపుడైనా. ఈ ద్వైదీ భావనే మనల్ని తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. కానీ ఆ సందర్భాల్లో నా ప్రవర్తనను నాకు నేను బేరీజు వేసుకొంటే నాకే కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అదేమంటే వాళ్ళెవరైన నోరుతెరిచి ఇదీసంగతి అని చెప్పారా? లేదే! ఏ ఆడదీ అలా డైరెక్టుగా మాట్లాడదు కదా! మరి ఏమిచూసి మనకలాగ అనిపిస్తుంది? చూసారా ఇదెంతటి మాయో? నిజంగానే వాళ్ళనలా ఊహించుకొని చెయ్యి పట్టుకొంటే? రెండు రకాలుగా జరగొచ్చు ఒకటి నా పేరు నాశనమవడం, లేదా ఆ ఊబిలో దిగి నన్ను నేను శాశ్వతంగా కోల్పోవడం. ఇవన్నీ ఎవరి జీవితానికైనా అనవసరమే కదా!