పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడాలి,రెండు కుటుంబాలు కలవాలి..కానీ బలవంతంగా జరిగే పెళ్లిల్ల గురించి విన్నారా..ఓహ్ ప్రేమికుల పెళ్లిని కాదని తల్లిదండ్రులు బలవంతంగా చేసే పెళ్లిల్లు చూసాం..ఆడపిల్లలకు ఇష్టం లేని పెళ్లిల్ల గురించి విన్నాం కానీ అబ్బాయిలకు బలవంతంగా చేసే పెళ్లిల్ల గురించి విన్నారా.అది కూడా చదువుకున్న వాడిని,ఒడ్డు పొడుగు బాగున్నవాన్ని చూసి కిడ్నాప్ చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు.ఎక్కడో తెలుసా..
బీహార్ రాష్ట్రంలో అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిల్లు చేస్తున్నారట..2014 ఏడాదిలో 2,526, 2015 లో 3,000, 2016లో 3,070, 2017 లో 3,405 బలవంతపు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. అంటే యేటేటా బలవంతపు పెళ్లిళ్ల సంఖ్య పెరుగుతున్నదే కాని తరగడం లేదు.. ముఖ్యంగా ఈ బలవంతపు పెళ్లిళ్లకు బలవుతవుతున్నది మగవారేనని చెబుతుండడం ఇప్పుడు ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ముఖ్యంగా బాగా చదువుకున్న విద్యావంతులు.. జీవితంలో స్థిరపడిన యువకులను టార్గెట్ చేసుకొని కిడ్నాప్ చేసి… వారికి ఇష్టం లేకున్నా పెళ్లిళ్లు జరిపిస్తున్నారని అధికారులు తెలిపారు. అది కూడా యువకులను బెదిరించి.. గన్ పాయింట్ పెట్టి మరీ వివాహాలను జరిపిస్తున్నారట.. ఇటువంటి బలవంతపు వివాహాలు అక్కడ రోజుకు తొమ్మిది వరకూ జరుగుతున్నాయని పోలీస్ అధికారులు అంటున్నారు.కాబట్టి బీహార్ వెళ్లే కుర్రాళ్లు తస్మాత్ జాగ్రత్తా..