lifestyle

ల‌వ్‌లో ఫెయిల్ అయ్యారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">లవ్‌&comma; ప్రేమ&comma; కాదల్‌&comma; ఇష్క్‌&period;&period; ఇలా ఏ భాషలో చెప్పినా&period;&period; ఆ అందమైన అనుభూతిని మాటల్లోనో&period;&period; అక్షరాల్లోనో చెప్పలేము&period; అదొక ప్రత్యేక అనుభూతి&period; ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు&period;&period; మనస్పర్థలు&comma; పొరపొచ్చాలు రావటం సహజమే&period; కానీ అనుకోని పరిస్థితుల్లో&period;&period; ఇద్దరి మధ్య దూరం పెరిగి&period;&period; ప్రేమ బంధానికి బ్రేక్‌ పడితే&period;&period; ఆ బాధ వర్ణనాతీతం&period; లవ్‌ ఫెయిల్‌ అయినప్పుడే ధైర్యంగా ఉండాలి&period; లవ్‌ లైఫ్‌ ఒక్కటే జీవితం కాదనీ&period;&period; జీవితంలో ఇంకా సాధించాల్సింది ఉందని గుర్తుపెట్టుకోండి&period; మరి మీ భగ్నప్రేమ తాలూకా జ్ఞాపకాలు మరిచిపోవటానికి టిప్స్‌ కావాలా&period;&period; అయితే&comma; తెలుసుకుందాం రండి&period; సమయమే ప్రతిదీ నయం చేస్తుందన్న సామెతను నమ్మండి&period; క్రమంగా భగ్నప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలు&period;&period; ఒక్కొక్కటిగా మరుపుకు వస్తాయి&period; కాస్త టైమ్‌ పట్టినా&comma; ఓపికతో ఉండండి&period; పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే ప్రదేశాలు&comma; అలవాట్లకు దూరంగా ఉండండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమ విఫలం కావటం ఎంతో బాధకరమైనది&period; అటువంటి బాధలో మీకు అండగా నిలిచేది కుటుంబ సభ్యులు&comma; స్నేహితులు అని గుర్తుపెట్టుకోండి&period; బాధలో మద్యం వంటి దురలవాట్లకు దగ్గర కాకండి&period; ఇవి శరీరాన్ని గుల్ల చేస్తాయే తప్పా&period;&period; గాయపడిన గుండెను సమాధానపరచలేవు&period; కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి&period; ప్రేమ తాలూకా జ్ఞాపకాలను వారితో పంచుకోకండి&period;&period; దాని వల్ల వారిని సైతం బాధపెట్టే అవకాశం ఉంది&period; పాత ప్రేమకు సంబంధించిన విషయాలను వదిలేయండి&period; పుస్తకాలు చదవటం&comma; మ్యూజిక్‌ వినటం వంటి హాబీలు ఉండే ఉంటాయి&period;&period; లేదా పేయింటింగ్‌&comma; గార్డెనింగ్‌ వంటి వాటిపై దృష్టి సారించండి&period; మీలో ఉన్న కళాకారులను బయటకు తీయండి&period; దీని వల్ల మనసంతా కొత్త పనులపై నిమగ్నమయ్యి&period;&period; పాత జ్ఞాపకాలు గుర్తుకు రావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85917 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;love-fail&period;jpg" alt&equals;"if you are failed in love then follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ప్రేమకు గుర్తుగా ఇచ్చిపుచ్చుకున్న గిఫ్ట్‌లు ఉంటే&comma; వారికి తిరిగి ఇచ్చేయండి&period;&period; లేదా ఇతరులకు దానం చేసేయండి&period; వాటిని మీతో పాటే ఉంచుకుంటే&period;&period; నిరంతరం వారే గుర్తుకు వచ్చే ప్రమాదం ఉంది&period; వారు గుర్తుకు వచ్చే&period;&period; ఎటువంటి గుర్తులను ఉంచుకోకండి&period; ఒకవేళ వారు గుర్తుకు వచ్చినా&period;&period; నేను డిస్టర్బ్‌ కాను&period;&period; నేను ఏంటో వారికి చూపించాలి&period;&period; నేనంటే నిరూపించుకోవాలి అని అనుకుంటే&period;&period; కసిగా మీ గోల్‌పై దృష్టి సారించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts