lifestyle

మీ పిల్ల‌ల‌పై మీరు ఎక్కువ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు అలా ఉండకూడదు&period;&period; ఇలా ఉండకూడదు&period;&period; ఇది మాత్రమే చెయ్యాలి&period;&period; అది చెయ్యకూడదు అంటూ మీ పిల్లలకు కండీషన్స్‌ పెడుతున్నారా&quest; వారితో కఠినంగానే ఉంటేనే మనపై గౌరవ&comma; మర్యాదలతో ఉంటారనీ&comma; చెప్పిన మాటల వింటారని అనుకుంటున్నారా&quest; అయితే క్రమంగా మీరే మీకు మీ పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించుకుంటున్నారన్నమాట&period; నమ్మకం కలగటం లేదా&period;&period; అయితే ఈ Parenting tips పూర్తిగా చదవండి&period; పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది&period; మీరు ప్రవర్తించే తీరు&comma; వారితో గడిపే సమయం&comma; మాట్లాడే ప్రతిమాట వారిని ప్రభావితం చేస్తాయి&period; మీ ప్రవర్తన ఆధారంగానే&period;&period; వారు కూడా ప్రవర్తిస్తారని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి&period; చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాం&comma; క్రమశిక్షణతో పెంచేస్తున్నాం అంటూ కఠిన నియమాలు పెడితే మెుదటికే మోసం వస్తుంది&period; మీతో వారు ఎప్పటికీ క్లోజ్‌గా మూవ్‌ కాలేరు అటువంటి చర్యల వల్ల&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రమశిక్షణ పేరిట వారిని శిక్షిస్తున్నారని గుర్తుపెట్టుకోండి&period; మీకు భయపడి ఇంట్లో నెమ్మ‌దిగా ఉన్నా&period;&period; బయటకు వెళ్లినప్పుడో&comma; మీరు వారితో లేనప్పుడో&comma; పాఠశాలలల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తారు&period; ఏదైనా తప్పు చేస్తే&period;&period; పనిష్మెంట్‌ ఇవ్వటం పిల్లలలో ప్రతికూల భావాలు ఏర్పడతాయి&period; ఆ పనిని ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రేమగా అడిగి తెలుసుకోండి&period;&period; మరలా అటువంటి పనులు చేయవద్దని సున్నితంగా మందలించండి&period;&period; అంతేగానీ కఠినంగా వ్యవహరించకండి&period; అలా మాట్లాడకూడదు&period;&period; ఇలా ఆడకూడదు అంటూ రూల్స్‌ పెట్టకండి&period; ఇంట్లో మీరు సున్నితంగా మాట్లాడితే&period;&period; క్రమంగా మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి&period; పిల్లలు వారి తల్లిదండ్రులను అనుకరించేందుకు ప్రయత్నిస్తారని తెలుసుకోండి&period; బయటకు వెళ్లినప్పుడు స్వేచ్ఛగా తిరగనివ్వండి&period; ఎగరకూడదు&comma; గెంతకూడదు అని నిబంధనలు పెట్టకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85921 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kids-with-parents&period;jpg" alt&equals;"parents must follow these parenting tips for their kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలు ఏమైనా చెప్పినప్పుడు ఏకాగ్రతతో వినండి&period; అంతేగాని నామమాత్రంగా ఊకొట్టి వదిలేయకండి&period; దీనివల్ల తాము ఏం చెప్పినా తల్లిదండ్రులు వినరు అన్న భావనకు వచ్చేస్తారు&period; అనుకోకుండా వారు ఏమైనా తప్పు చేసినప్పుడు సంజాయిషీ చెప్పినప్పుడు వారివైపు నుంచి కూడా ఆలోచించండి&period;&period; అనాలోచితంగా పిల్లలదే తప్పు అని రుద్దకండి&period; దీనివల్ల మీపై పిల్లలు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది&period; కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురయ్యి&period;&period; మానసిక రుగ్మతలతో బాధపడే ఆస్కారం ఉంది&period; పిల్లలతో ఫ్రెండ్స్‌లా పేరంట్స్‌ ఉంటే&period;&period; వారు మీతో వారుకున్న అన్ని సమస్యలను మనసు విప్పి చెప్పుకోగలరు&period; వారి ఇష్టాయిష్టాలు పంచుకోగలుగుతారు&period; వారితో ఎక్కువ సమయం గడపటానికి ట్రై చేయండి&period; మీ ఆఫీస్‌ సమస్యలు ఇంటి వరకు తీసుకురాకండి&period; పిల్లల వద్ద ఆర్థిక సమస్యల గురించి మాట్లాడకండి&period; తరుచుగా పిల్లలను బయట తిప్పండి&period; భార్యభర్తల మధ్య వివాదాలు సహజమే&period;&period; కానీ పిల్లల ముందు మీ కోపతాపాలు చూపించకండి&period; అమ్మ కూచి&comma; నాన్న కూచి అన్న స్టాంప్‌ను పిల్లలు మీద వేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts