lifestyle

చాణక్య నీతి: ఈ పని చేస్తే శత్రువులైన నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే..!!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో గౌరవం, డబ్బు,హోదా లాంటి వాటి కోసమే తాపత్రయపడుతుంటారు.. మరి వాటిని పొందే అర్హత వారికి ఉందో లేదో ప్రశ్నించుకోరు. మనకు అదృష్టం వల్ల వచ్చిన ఫలితం ఎక్కువ రోజులు నిలబడదు. దేనికైనా ఒక అర్హత ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మరి డబ్బు, హోదా గురించి చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఏం చెప్పారో మనం చూద్దాం.. జ్ఞానం ఉన్న వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది.

అందుకే వయసులో ఎదిగే దశలో తప్పనిసరిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చాణిక్యుడు అంటున్నారు.జ్ఞానాన్ని పెంచుకుంటే సరిపోదు, మనకు ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడం కూడా ముఖ్యం.. ఇలా చేయడం వల్ల మనల్ని శత్రువులు కూడా గౌరవిస్తారు. ఒక వ్యక్తి నిజాయితీగా సంస్కారవంతంగా బతికితే, అతడిపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఇతరులకు సాధ్యం కాదు.. నీవు ఎంత శత్రువైన సరే మిమ్మల్ని ఏం చేయలేరు.. మీ ప్రతిష్టను దెబ్బ తీయడం చాలా కష్టం. మనం చేసే పనిని ప్రేమించాలి..

if you have these qualities then your enemies will not do anything

అలా చేయడం వల్ల మీ నైపుణ్యం పెరిగి డబ్బు హోదా తప్పక లభిస్తాయి. దీని వల్ల మీ గౌరవం కూడా పెరుగుతుంది.. ఆ నైపుణ్యాన్ని నలుగురి ముందు ప్రదర్శిస్తే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మీకు మైనస్ ఉంటేనే శత్రువుకి భయపడాలి. కానీ నిజాయితీ,జ్ఞానం సంస్కారం మీ సొంతమైతే ఎంతమంది శత్రువులు ఏకమైనా మిమ్మల్ని ఏమీ చేయలేరనీ చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలియజేశారు.

Admin

Recent Posts