lifestyle

పురుషుల కోసం ఆచార్య చాణ‌క్య చెప్పిన సూత్రాలు.. క‌చ్చితంగా పాటించాల్సిందే..

ఆచార్య చాణ‌క్య గురించి అంద‌రికీ తెలిసిందే. ఈయ‌న గుప్తుల కాలం నాటి వారు. అప్ప‌ట్లోనే ఈయ‌న మ‌న జీవితానికి సంబంధించి అనేక అమూల్య‌మైన సూత్రాల‌ను చెప్పారు. చాణ‌క్య చెప్పిన నీతి సూత్రాల‌ను మనం పాటిస్తే జీవితంలో ఎంతో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవ‌చ్చు. మ‌న వ్య‌క్తిత్వ వికాసానికి చాణ‌క్య సూత్రాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక చాణ‌క్య ప్ర‌త్యేకించి పురుషుల కోస‌మే ప‌లు సూత్రాల‌ను చెప్పారు. వాటిని పురుషులు గ‌న‌క పాటిస్తే జీవితంలో అస‌లు తిరుగుండ‌దు. ఇక పురుషుల కోసం చాణ‌క్యుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవ‌రికైనా ఒక మాట ఇస్తే దాన్ని క‌చ్చితంగా నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయండి. మాట త‌ప్ప‌కండి. డ‌బ్బు ఎల్ల‌ప్పుడూ మ‌ర్యాద నేర్పించ‌దు. మంచి అలవాట్ల‌ను క‌లిగి ఉండాలి. ఇత‌రుల‌ను గౌర‌వించాలి.

నిన్ను, నీ కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది అనుకునే మ‌హిళ‌నే పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిని కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా అణ‌కువ క‌లిగి ఉండాలి. అందరితోనూ మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాలి. మీరు బాధ‌ప‌డితే ఇత‌రుల‌కు వ‌చ్చే సంతృప్తిని ద‌క్క‌నివ్వ‌కూడ‌దు. కోపంలో ఉన్న‌ప్పుడు నిర్ణ‌యాల‌ను తీసుకోకు. జీవితం చాలా చిన్న‌ది. స‌మ‌యం చాలా త‌క్కువ‌. అనుకున్న ప‌నిని వెంట‌నే చేయండి. స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి. ఈ ప్ర‌పంచంలో నువ్వు ఒంట‌రివి అనుకుని జీవించు. ఏ స‌మ‌స్య‌ను అయినా ఒంటరిగానే ప‌రిష్క‌రించుకోవ‌డం నేర్చుకో. కోపం, ప్ర‌తీకారం వ‌ల్ల వ‌చ్చే భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకో.

important rules told by chanakya for men

నిన్ను నువ్వు క్ష‌మించుకో. ఇత‌రుల‌ను క్ష‌మించు. నీక‌న్నా తెలివి ఎక్కువ ఉన్న‌వారితోనే స్నేహం చెయ్యి. వాళ్ల నుంచి నేర్చుకో. అర్థం ప‌ర్థం లేని వాదన‌ల‌ను ఎవ‌రితోనూ పెట్టుకోవ‌ద్దు. ఒక‌రి గురించి చాడీలు, పుకార్లు వ్యాప్తి చేయొద్దు. లేని విష‌యాన్ని ఉన్న‌ట్లుగా చెప్ప‌వ‌ద్దు. నువ్వు ఎవ‌రినీ మోసం చేయ‌లేవు.. అన్న స‌త్యాన్ని గ్రహించు. త‌ల్లిదండ్రులు అంద‌రిక‌న్నా ముఖ్యం. వారిని ఆద‌రించు.

Admin

Recent Posts