ఈ రోజుల్లో చాలా మంది ఐఫోన్ కొనాలని ఎన్నో కలలు కంటున్నారు. ఐఫోన్ కొనాలనేది సామాన్యుడికి అందని ద్రాక్షనే. కాకపోతే కొందరు అప్పు సొప్పులు చేసి మరీ ఐఫోన్ కొంటున్నారు. రీసెంట్‌గా ఐఫోన్ 16 లాంచ్ కాగా, దాని ధర అయితే అమాంతం పెరిగింది. ఇలాంటి ధరలని చూసి కూడా కొందరు ఐఫోన్ పై ఆసక్తి చంపుకోవడం లేదు. అయితే ఓ చెత్త (స్క్రాప్) వ్యాపారి పొట్ట చేత పట్టుకొని సంపాదిస్తున్నాడు. అతను తన కొడుకు ఆనందం కోసం ఏకంగా ఐఫోన్ కొనివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. చిన్న సంపాదన అయిన పరీక్షలో ఫస్ట్ రావడంతో కొడుక్కి ఐఫోన్ కొనిచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏ వృత్తి చేస్తున్నా తండ్రి ప్రేమ అనేది ఉంటుంది కదా అని చెప్తున్నాడు. ఇదొక్కటే కాదు గతంలో కూడా తన కొడుకు చదువులో మంచి ప్రతిభ చూపుతున్నాడని చాలా ఐఫోన్లు కొనిచ్చినట్లు చెప్తున్నాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియలేదు. ఘర్ క కలేష్ అనే ఎక్స్ అకౌంట్లో ఈ వీడియో షేర్ అయ్యింది. తక్కువ సమయంలోనే భారీ వ్యూవ్స్ ను దక్కించుకుంది.వీడియోలో, ఉత్సాహంగా ఉన్న తండ్రి గర్వంగా ఐఫోన్‌ను పట్టుకొని చూపిస్తున్నాడు. మాట్లాడేటప్పుడు అతని భాష కూడా స్పష్టంగా లేదు. అయినప్పటికీ, అతను తన కొడుకు సాధించిన విజయాలపై గర్విస్తూ తన స్క్రాప్ వ్యాపారం గురించి మాట్లాడుతున్నట్లు అనిపించింది. స్క్రాప్ డీలర్ తన కోసం రూ. 85,000 విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు . తన కొడుకు కోసం రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్-16ని బహుమతిగా ఇచ్చాడు.
తన కొడుకు ఇటీవల జరిగిన బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడని అభినందిస్తూ బహుమతిగా ఐఫోన్ 16 ఇచ్చినట్లు చెప్పుకచ్చాడు. పని ఏదైనా తండ్రి ప్రేమ అద్భుతమని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యక్తి చిరునవ్వే కోట్లాది రూపాయలతో సమానం. ఒక నెటిజన్ ‘కొడుకు తన తండ్రికి మిలియన్ డాలర్ల బహుమతి’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి స్క్రాప్ వ్యాపారి చేసిన పని మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.