lifestyle

సక్సెస్ పొందిన ఈ ప్రముఖులు రోజు ఒకేలాంటి దుస్తులు ధ‌రిస్తారు…దానివెనకున్న 3 కారణాలు ఇవే..!

మార్క్ జుక‌ర్ బ‌ర్గ్‌.. ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు.. ప్ర‌స్తుతం ఆ సంస్థ‌కు జుక‌ర్‌బ‌ర్గ్ చైర్మ‌న్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక స్టీవ్ జాబ్స్‌.. ఈయన యాపిల్ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు. ఆ కంపెనీకి సీఈవోగా కూడా ఉన్నారు. అయితే ఈయ‌న ప్ర‌స్తుతం మ‌న మ‌ధ్య లేరు. చ‌నిపోయారు. అదేవిధంగా సెగ్‌వే అనే సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు డీన్ కామెన్‌. హాలీవుడ్ సినిమా డైరెక్ట‌ర్ క్రిస్టొఫ‌ర్ నోలాన్. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా..! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కొంచెం పెద్దిగానే ఉంటుంది. ఏంటీ లిస్ట్‌.. ధ‌నికుల జాబితానా..? అనుకుంటున్నారా..? అయితే అది కాదు. వీరంద‌రిలో మ‌నం కామ‌న్‌గా గుర్తించ ద‌గిన అంశం ఒక‌టుంది. అదేమిటంటే.. వీరంద‌రినీ ఒక‌సారి ప‌రిశీలిస్తే వీరు ఎప్పుడూ ఒకే ర‌క‌మైన దుస్తుల్లో క‌నిపిస్తారు.

అంటే మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ఏమో గ్రే టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్ వేసుకుంటారు. ఇక క్రిస్టోఫ‌ర్ నోలాన్ అయితే కోటు, స్కార్ఫ్‌తో ఉంటారు. అదే స్టీవ్ జాబ్స్ అయితే న‌లుపు టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్‌తో క‌నిపిస్తారు. అవును క‌దా. అయితే వారు అలా రోజూ ఒకేలాంటి దుస్తులు ఎందుకు వేసుకుంటారో, దాని వెనుక కార‌ణాలు ఏమిటో మీకు తెలుసా..? అవే ఇప్పుడు తెలుసుకుందాం. పైన చెప్పిన ప్ర‌ముఖులు అంద‌రూ రోజూ ఒకేలాంటి దుస్తుల‌ను వేసుకోవడం వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటంటే…

these famous people wear same dresses every day know why

టైం సేవ్ అవుతుంది. అవును మ‌రి. స‌హజంగా మ‌న‌కే చాలా దుస్తులు ఉంటే ఈ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలా ? అని చాలా సేపు ఆలోచిస్తాం. దీంతో చాలా టైం వేస్ట్ అవుతుంది. మ‌రి అలాంటి ప్ర‌ముఖుల‌కు ఉండే దుస్తులు ఎన్నో మ‌నం ఇట్టే చెప్ప‌వ‌చ్చు. దాంతో వారికి ఇంకా టైం వేస్ట్ అవుతుంది. అస‌లే వారి సంపాద‌న ఒక నిమిషంలోనే కొన్ని ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంది. అలాంట‌ప్పుడు వారు ఒక నిమిషం వృథా చేస్తే అంత వర‌కు వారికి లాస్ వ‌చ్చిన‌ట్టే క‌దా. అందుక‌నే టైం సేవింగ్ అవుతుంద‌ని చెప్పి రోజూ వారు ఒకేలాంటి దుస్తులు ధ‌రిస్తారు. దీంతో రోజూ ఏ డ్రెస్ వేసుకోవాలి అని టైం వేస్ట్ చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు. అది అలా వారికి క‌ల‌సి వ‌స్తుంది.

ఇక ఇందులో ఉన్న మ‌రో కార‌ణం ఏమిటంటే… ఇలా రోజూ ఒకేలాంటి దుస్తులు వేసుకోడం వ‌ల్ల మాన‌సికంగా అది ప్ర‌భావం చూపుతుంద‌ట‌. దీంతో ఇత‌ర ఏ అంశంలోనైనా చాలా వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌ట‌. చివ‌ర‌గా ఇందులో దాగి ఉన్న మ‌రో కార‌ణం ఏమిటంటే… ఇలా రోజూ ఒకేలాంటి దుస్తులు వేసుకోవ‌డం వ‌ల్ల వ్య‌క్తుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త బాగా ఉంటుంద‌ట‌. దీంతో ఏ ప‌నిలో అయినా ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగుతారు. అంతేకాదు, దానిపై చాలా సునిశిత దృష్టి పెడతారు. అందుకే వారు అలా ప్ర‌ముఖులు అయ్యారు.

Admin

Recent Posts