lifestyle

ఉంగ‌రాన్ని ఆ వేలికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు విషయం తెలియని చాలామంది అది ఉంగరపు వేలు&period; ఉంగరం దానికే పెట్టుకోవాలి అని పిల్లలకు చెబుతుంటారు&period; కానీ&comma; అది వాస్తవం కాదు&period; ఉంగరపు వేలుని సంస్కృతిలో అనామిక అని అంటారు&period; అంటే పేరు పెట్టని వేలు అని అర్థం&period; జీవితంలో ఒకసారి వచ్చే పెండ్లి వేడుకలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరం తొడుగుతారు&period; అప్పుడు కూడా ఉంగరం వేలునే ఎంచుకుంటారు&period; అలా ఆ వేలుకు ఉంగరం పెడితే ఒకరి స్పందనలు ఒకరికి తాకుతాయని నమ్మకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో ఉండే ప్రతి భాగం అరికాలులో కనబడుతుంది అంటారు&period; ఏ భాగానికైనా నొప్పి ఉంటే అరికాలిలో నొక్కితే తగ్గుతుంది అంటారు&period; అలా చేతి ఉంగరపు వేలుకు&comma; చెవికి మధ్య సంబంధం ఉంటుంది&period; ఒకసారి కుడిచేతి ఉంగరపు వేలును గట్టిగా నొక్కి చూడండి&period; దీని స్పందన కుడిచెవి దగ్గర ఉంటుంది&period; అలాగే ఎడమచేతి ఉంగరపు వేలుని నొక్కినా ఎడమచెవి దగ్గర ప్రతిస్పందిస్తాయి&period; అయితే మహిళలకు చెవులు కుట్టిస్తుంటారు&period; దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చేతి నాలుగవ వేలుకి ఆభరణంగా ఉంగరం ధరించడం మొదలుపెట్టారు&period; ఇప్పుడు మగవాళ్లు కూడా చెవులు కుట్టించుకోవడం ట్రెండ్‌గా భావిస్తున్నారు&period; మరి ఉంగరం ఏ చేతి వేలుకి ధరించాలో అని సందేహంలో ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు&period; కొంతమంది కుడిచేతికి పెట్టుకోవడానికి మొగ్గుచూపుతారు&period; మరికొందరికి ఎడమ చేయి బాగుంటుందని దానికే పెట్టుకోవాలనుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73407 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rings&period;jpg" alt&equals;"why we wear rings to those fingers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి ఏ చేతికి పెట్టుకోవాలో అన్న దానికి కూడా ఓ పరమార్ధం ఉన్నది&period; పూర్వంలో ఉంగరాన్ని కుడిచేతికే ధరించేవారు&period; అది కూడా రాగి ఉంగరాన్నే ఎంచుకునేవారు&period; ఎందుకో తెలుసా&quest; చాలామంది కుడిచేతితోనే అన్నం తింటారు&period; అనుకోకుండా ఆహారం విషతుల్యం అయినప్పుడు &lpar;పాయిజన్ కలిసినప్పుడు&rpar; రాగి ఉంగరం ధరించిన చేయి ఆహారంలో పెట్టగానే ఆ ఉంగరం కాస్త నీలిరంగులోకి మారుతుందట&period; దాంతో ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు అన్నది వారి అభిప్రాయం&period; అందుకే వారు రాగితో చేసిన ఉంగరాన్నే అది కూడా కుడిచేతి నాల్గవ వేలికే ధరించేవారట&period; ఉంగరం ఎడమచేతికి ధరిస్తే గుండెకు మేలు జరుగుతుందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఖాళీగా ఉండడంతో పొద్దుపోదు&period; దాంతో గోర్లు కొరకడం&comma; చేతికి ఉన్న ఉంగరాలను పెడుతూ తీస్తూ ఉంటారు&period; ఒక్కోసారి అలా తీసిన ఉంగరం అక్కడే మర్చిపోయి ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉండి ఉంటాయి&period; అలా ఉంగరం తీసి పెడుతూ ఉంటావెందుకని పక్కన వాళ్లు కూడా అంటుంటారు&period; ఇదీ ఒకందుకు మంచిదే అంటున్నారు&period; ఎందుకంటారా&quest; వేలి ఉంగరాన్ని సగం వరకు తీస్తూ పెడుతూ ఉండడం వల్ల వేలు మీద కొంచెం ఒత్తిడి పడుతుంది&period; ఇది కిడ్నీల పనితీరును&comma; నరాల తీరును మెరుగుపరుస్తుందట&period; అందుకే ఉంగరాన్ని ఆభరణంగా కాకుండా ఆరోగ్య ప్రదాయినిగా వాడడం మంచిదేనట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts