lifestyle

భార్యాభర్తల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచే 4 పదాలు, ఇది వాడితే అసలు గొడవలే ఉండవట!

పెళ్లిళ్లు దేవుడి ఆదేశాల మేరకు నిర్ణయించబడతాయి అని పెద్దలు చెప్తుండడం మనం వింటుంటాం. అలా వారు ఎందుకు చెప్తారో కూడా వివరిస్తుంటారు. వారి వివరణ ఏంటంటే, తగు ఈడు జోడు మాత్రమే కాదు అర్థం చేసుకునే తత్వం ఉండే వారిని జంటగా భగవంతుడు కలుపుతాడని, అలా దేవుడు వధూవరులను జంటగా మారుస్తాడని చెప్తుంటారు.

కాగా, పెళ్లి అయిన కొత్తల్లో కలిసిమెలిసి ఉండే భార్యాభర్తలు ఆ తర్వాత కాలంలో అంత అన్యోన్యంగా ఉండబోరని అంటుంటారు. అందుకు కారణం వారి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడం. అది తరచూ గొడవలు పెట్టుకోవడం కూడా కారణంగా ఉంటుంది. అయితే భార్యాభర్తల‌ బంధం కలిసి ఉండాలంటే వారి మధ్య ఒక నాలుగు పదాలు కచ్చితంగా ఉండాలని అప్పుడే వారి బంధం బలపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

wife and husband must say these words

ఆ పదాలు కూడా మనకు తెలిసినవే. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఎవరో ఒకరు సారీ చెప్పాలట. ఈ పదంతో వారి మధ్య ఉండే మనస్పర్ధలు తొలగిపోతాయట. తప్పు చేసిన వారు కచ్చితంగా నన్ను క్షమించాలని అడగాలట. అలా చేయడం వల్ల అసలు గొడవ మొదలవకుండా ఉంటుంది. అంతేకాకుండా వీలైతే భార్యాభర్తలు కచ్చితంగా ప్రతిరోజు ఐ లవ్ యు చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది.

Admin

Recent Posts