డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శరీరంలో సహజంగా రక్తంలో చక్కెర (గ్లూకోజ్‌) కొంత శాతం ఉంటుంది. కానీ చక్కెర స్థాయిలు నిర్దిష్ట‌మైన‌ మొత్తాన్ని దాటినప్పుడు అది హైపర్ గ్లైసీమియాకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది కిడ్నీలు, కాలేయం, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ‌చ్చేందుకు అస‌లు ప్రధాన కారణం తెలియదు. కానీ రక్తంలో చక్కెర అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే జీవనశైలిని మెరుగుపరుచుకోవ‌డం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వ‌ల్ల మధుమేహాన్ని నియంత్రించ‌వ‌చ్చు.

5 early symptoms of diabetes

డయాబెటిస్ ఉన్న‌వారు ర‌క్తంలో ఉండే షుగ‌ర్ స్థాయిల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు క‌న్నేసి ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌క్కెర స్థాయిల‌ను చెక్ చేసుకోవాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్ర‌దించాలి. వైద్యులు ఇచ్చే మందుల‌ను స‌కాలంలో తీసుకోవాలి. దీంతోపాటు నిత్యం శారీర‌క శ్ర‌మ కూడా చేయాలి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్తంలో అధిక చ‌క్కెర స్థాయిల‌ను పట్టించుకోక‌పోతే అది తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. ఇక డ‌యాబెటిస్ వ‌చ్చిన వారికి ప్రారంభంలోనే అనేక ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఆల‌స్యం కాకుండా ముందుగానే ఆ సంకేతాలు, ల‌క్ష‌ణాల‌ను తెలుసుకుంటే త‌ద్వారా స‌కాలంలో చికిత్స తీసుకుని డ‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

డయాబెటిస్ ప్రారంభంలో ఉన్న‌ప్పుడు క‌నిపించే సంకేతాలు, లక్షణాలు

1. తరచుగా మూత్రవిసర్జన

మీ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు మీ మూత్రపిండాలు దానిని సరిగ్గా ఫిల్టర్ చేయడంలో విఫలమవుతాయి. దీనివల్ల చక్కెర మూత్రంలో పేరుకుపోతుంది. దీంతో తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వ‌స్తుంది. అలాగే ఇది ఈస్ట్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. బాత్‌రూమ్‌ను సాధారణం కంటే ఎక్కువగా ఉప‌యోగిస్తున్నార‌ని మీకు తెలిస్తే.. అప్పుడు మీరు డయాబెటిస్ తో బాధ‌ప‌డుతున్న‌ట్లు అర్థం చేసుకోవాలి. ఇది డ‌యాబెటిస్ ప్రారంభంలో ఉంద‌నేందుకు ఒక‌ సంకేతం.

2. ఆకస్మికంగా బరువు తగ్గడం

డ‌యాబెటిస్ ప్రారంభ ద‌శ‌లో ఉంటే ఆక‌స్మికంగా బ‌రువు త‌గ్గుతారు. ఎందుకంటే శ‌రీరం గ్లూకోజ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోలేదు. దీంతో శ‌క్తి కోసం శరీరం కొవ్వును ఖ‌ర్చు చేస్తుంది. ఈ క్ర‌మంలో కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువును ఆక‌స్మికంగా త‌గ్గారంటే దాన్ని డ‌యాబెటిస్‌కు ప్రారంభ సూచ‌న‌గా భావించాలి.

3. చూపు మంద‌గించ‌డం

డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో కంటి చూపు మంద‌గిస్తుంది. దృష్టి లోపం వ‌స్తుంది. చుట్టూ ఉన్న ప‌రిస‌రాలు స‌రిగ్గా క‌నిపించ‌వు. అయితే ఒక్క‌సారిగా దృష్టి లోపం అనేది రాదు. ముందుగా సైట్ స‌మ‌స్య వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల సైట్ వ‌చ్చింద‌ని కూడా కొంద‌రు అనుకుంటారు. కానీ జాగ్ర‌త్త‌గా ప‌రీక్ష‌లు చేయించుకుంటే షుగ‌ర్ ఉందీ, లేనిదీ తెలుస్తుంది. దీంతో షుగ‌ర్ ఉంటే వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవ‌చ్చు. కంటి చూపు మంద‌గించేందుకు అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. అందువ‌ల్ల కంటి ప‌రీక్ష‌ల‌తోపాటు షుగ‌ర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి.

4. అధిక అలసట

రక్తంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల గతంలో కంటే ఎక్కువగా అల‌సిపోయినట్లు అనిపిస్తుంది. అధిక అలసట మధుమేహానికి సంకేతం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా శ్రమించక‌పోయినా డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తారు. దీంతోపాటు అల‌స‌ట కూడా వ‌స్తుంది. ఎక్కువ‌గా శ్ర‌మించ‌కున్నా అల‌స‌ట వ‌స్తుందంటే అందుకు డ‌యాబెటిస్ కార‌ణ‌మ‌ని భావించాలి. ఆ మేర‌కు ప‌రీక్ష‌లు చేయించుకుని షుగ‌ర్ ఉందీ, లేనిదీ నిర్దారించుకోవాలి.

5. చ‌ర్మం రంగు

టైప్ 2 డయాబెటిస్ వ‌చ్చిందంటే చ‌ర్మం రంగు మారుతుంది. ముఖ్యంగా మెడ చుట్టూ ఉన్న చ‌ర్మం న‌ల్ల‌గా అవుతుంది. ఇలా జ‌రిగేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. వాటిల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. అయితే ఎవ‌రికైనా ఇలా జ‌రిగితే ఎందుకైనా మంచిది షుగ‌ర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. దీంతో డ‌యాబెటిస్ వ‌ల్ల అలా అయిందా, లేదా అనేది నిర్దార‌ణ అవుతుంది. ఇలా ఆయా ల‌క్ష‌ణాలను ముందుగానే గ‌మ‌నించ‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను ఆరంభంలోనే గుర్తించి అందుకు త‌గిన విధంగా చికిత్స తీసుకునేందుకు వీలు క‌లుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts