అంతా బాగానే వున్నట్లనిపిస్తుంది. కానీ వున్నట్టుండి ఆరోగ్యం డవున్ అయినట్లనిపిస్తూంటుంది. షుగర్ వ్యాధి వున్నట్లయితే, దానిపై ఎల్లపుడూ ఒక కన్నేసి వుంచాలి. డాక్టర్ ఎవరైనా కానీ లేక మీరుండే ప్రదేశం ఏదైనా కానీ కనీసం 4 నుండి 6 వారాలకొకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. నియంత్రణ సరిగా లేదని భావిస్తే నెలకోసారి. కంట్రోల్ లో వుంటోందని భావిస్తే రెండు లేక మూడు నెలలకోసారి కూడా షుగర్ పరీక్షలు చేయించుకోవచ్చు. పరీక్ష, ఫాస్టింగ్, తిన్న తర్వాత లేక సమయాన్ని బట్టి అని మూడు రకాలుగా వుంటుంది. అన్నిటికంటే కూడా ఫాస్టింగ్ షుగర్ పరీక్ష అంటే ఉదయం వేళ ఏమీ తినకముందు పరీక్ష చేయించుకోవాలి.
సమయాన్ని బట్టి అంటే ర్యాండంగా చేయించుకొనే షుగర్ పరీక్ష ప్రామాణికం కాదు. గర్భిణీ స్త్రీలయితే పోస్ట్ లంచ్ అంటే ఆహారం తిన్న రెండు గంటలకు చేయించుకొని నియంత్రణకు మందులు వాడాలి. షుగర్ ను ఇంటి వద్దే చెక్ చేసుకోవచ్చు. నేడు షుగర్ చెకింగ్ కు మెషీన్లు వస్తున్నాయి. వీటిని గ్లూకో మీటర్లంటారు. ఇవి కూడా సరియైన రీడింగ్ ఫలితాలను చూపిస్తున్నాయి.
మీరు వీటి ఫలితాలను మరల లేబరేటరీ ఫలితాలతో చెక్ చేయించాల్సిన అవసరం లేదు. ఇంటివద్దే షుగర్ పరీక్షలు చేసుకొనే గ్లూకోమీటర్ల ధర రూ.1500 నుండి రూ.3500 వరకు వుంటున్నాయి. దీనిలో ఉపయోగించే స్ట్రిప్ లు 50 కి రూ.1000 వరకు అవుతుంది. కనుక బయటకు వెళ్ళి లేబరేటరీలలో చేయించుకోవడం కన్నా ఇంటివద్ద చేయించుకునే పరీక్షలు తక్కువ వ్యయంలోనే అయిపోతాయి.