వైద్య విజ్ఞానం

Urination : త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నారా.. ఈ వ్యాధులు ఉన్నాయేమో చూడండి..!

Urination : కొంతమందికి తరచూ యూరిన్ వస్తూ ఉంటుంది. మీరు కూడా తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారా, అయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. రోజుకి 7 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేయడం మంచిది. రాత్రిపూట కొద్దిగా నీళ్లు తాగితే, రెండు, మూడు సార్లు మూత్ర విసర్జన వస్తుంది. రాత్రి పదే పదే మూత్రవిసర్జన కి వెళ్లడం మంచి సూచన కాదు. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే, సమస్య ఉన్నట్లు గుర్తించాలి.

పైగా పలు కారణాల వలన కూడా తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు తరచుగా మూత్రవిసర్జన చేయడం ముఖ్యం. కాబట్టి, గర్భిణీ స్త్రీలు నీళ్లు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మామూలుగా ఆరోగ్యంగా ఉండడం కోసం, ప్రతి ఒక్కరు కూడా ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగడం మంచిది. కొన్ని వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, తరచుగా మూత్ర విసర్జన చేయడం మంచిది. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలి.

if you are urinating frequently then you might have these diseases

రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తే, టైపు 1, టైప్ 2 డయాబెటిస్ అవ్వచ్చు అని గుర్తు పెట్టుకోండి. జననేంద్రియాల‌లో మంట, ఇన్ఫెక్షన్స్ వంటివి ఉంటే కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వ‌స్తుంది. పొత్తి కడుపులో నొప్పి ఉన్నప్పుడు లేదంటే పొత్తికడుపులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వ‌స్తుంది. రక్తపోటు తో మందులు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. కిడ్నీలో రాళ్లు ఉంటే కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు.

మూత్రాశయ గోడలో మంట ఉంటే, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వ‌స్తుంది. నరాల సమస్య లేదంటే పక్షవాతం వచ్చినా, రేడియేషన్ థెరపీ, కిడ్నీ, గర్భాశయం లేదా క్యాన్సర్ వంటి బాధలు ఉన్నట్లయితే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వ‌స్తుంది. ఒకవేళ మూత్ర విసర్జన చేసినప్పుడు కడుపులో మంట లేదంటే మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి ఉంటే అశ్రద్ధ చెయ్యద్దు.

అలానే, మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కష్టంగా ఉండడం, మూత్రంలో రక్తం కనపడడం, మూత్రం దుర్వాసన రావడం, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటివి కనిపిస్తే క‌చ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఏమైనా సందేహం ఉంటే కచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. వ్యాధితో బాధపడడం కంటే, నివారించడం ముఖ్యమని గుర్తు పెట్టుకోండి.

Admin

Recent Posts