Water : మనం రోజూ తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం ఎంత అవసరమో.. తగినంత నీటిని తాగడం కూడా అంతే అవసరం. కానీ చాలా మంది రోజుకు సరిపడా నీటిని తాగలేకపోతుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే మన శరీరంలో నీరు తగ్గితే అప్పుడు మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని పరిశీలించడం ద్వారా మన శరీరంలో నీరు తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. దీంతో నీటిని తాగాల్సి ఉంటుంది. మరి నీరు తగ్గితే మన శరీరం ఎలాంటి లక్షణాలను చూపిస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మన శరీరంలో నీటి శాతం తగ్గితే మన శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. అసలు ఏ పని చేయలేం. శక్తి చాలా సన్నగిల్లిపోతుంది. చిన్న పని చేసినా అలసిపోతాం. అసలు శక్తి లేనట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. మన శరీరంలో నీరు తగినంతగా లేదని అర్థం చేసుకోవాలి.
2. మన శరీరంలో నీరు తగినంత లేకపోతే రాత్రి పూట కాలి పిక్కలు పట్టేస్తాయి. ఇలా కొందరికి మధ్యాహ్నం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ లక్షణం కనిపిస్తున్నా నీటిని తగినంత తాగడం లేదని తెలుసుకోవాలి.
3. నీటిని సరిగ్గా తాగకపోతే మన మూత్రం చిక్కగా వస్తుంది. మూత్రం కొందరికి గోధుమ రంగులో లేదా పూర్తిగా పసుపు రంగులో వస్తుంది. ఇలా వస్తుంటే శరీరంలో నీటి శాతం తగ్గిందని అర్థం చేసుకోవాలి.
4. పెదవులు పొడిబారుతున్నా.. కళ్లలో నీరు పోయి పొడిగా మారి దురదలు పెడుతున్నా.. శరీరంలో నీరు తగినంత లేదని తెలుసుకోవాలి.
5. నీరు శరీరంలో తగినంత లేకపోతే కొందరికి నోరు దుర్వాసన వస్తుంది. అలాగే కొందరికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కనుక ఈ లక్షణాలు కనిపిస్తున్నా సరే నీటిని సరిగ్గా తాగడం లేదని.. శరీరంలో నీరు తగినంత లేదని అర్థం చేసుకోవాలి. వెంటనే నీటిని తగినంత తాగాల్సి ఉంటుంది. దీంతో ఆయా లక్షణాలు మాయమవుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.