షుగర్ వ్యాధి రావటమనేది శరీరంలోని మెటబాలిక్ డిజార్డర్ కు నిదర్శనంగా చెపుతారు. టైప్ 2 డయాబెటీస్ రావటానికి తాజాగా ఏర్పడుతున్న సమస్యలైన …అధిక బరువు, శారీరక శ్రమ లేకుండుట, సరైన ఆహారం తినకుండుట, ఒత్తిడి, నగర జీవనం వంటివిగా నిపుణులు చెపుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు కారణంగా పురుషులలో 64 శాతం మహిళలలో 77 శాతం షుగర్ వ్యాధి వస్తోంది. షుగర్ తో తీపి చేసిన కూల్ డ్రింక్ లు, ఇతర తీపి పదార్ధాలు, ఆహారాలలో కొవ్వు ప్రధాన కారణాలుగా చెపుతున్నారు.
టైప్ 2 డయాబెటీస్ లో వంశానుగత మనేది తక్కువగా మాత్రమే ప్రభావం చూపుతోంది. 2011 నాటివరకు సుమారు 36 పైగా జీన్స్ మాత్రమే టైప్ 2 డయాబెటీస్ కు కారణమని పరిశోధకులు చెపుతున్నారు. ఈ జీన్స్ అన్నీ కలిపి 10 శాతం మాత్రమే వంశానుగతంగా డయాబెటీస్ వ్యాధి తెప్పిస్తున్నాయని వెల్లడైంది. చిన్న వయసు వారిలో జీన్స్ కారణంగా వచ్చే డయాబెటీస్ 1 నుండి 5 శాతం మాత్రమేగా వెల్లడైంది. డయాబెటీస్ వ్యాధి రావటానికి అనేక మందులు, ఆరోగ్య సమస్యలు కూడా దోహదం చేస్తున్నాయి.
గ్లూకోకార్టికాయిడ్స్, ధయాటైడ్స్, బేటా అడ్రెనర్జిక్ ఎగోనిస్ట్, ఆల్ఫా ఇంటర్ ఫెరాన్ వండి మెడిసిన్ లు గతంలో గర్భవతులైనపుడు వుండే డయాబెటీస్ కారణంగా వారి పిల్లలకు తర్వాతి భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతోంది. ఆరోగ్య సమస్యలంటే, క్రషింగ్ సిండ్రోమ్, హైపర్ ధైరాయిడిజం, ఫోక్రోమోసిటోమా, ఇతరంగా కొన్ని కేన్సర్స్ కారణంగాను, టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా వుండటం వలన కూడా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి కలుగుతోందని డయాబెటీస్ నిపుణులు తెలుపుతున్నారు.