మనలో గోళ్లు కొరకడం చాలా మందికి అలవాటు. ఏదో పని ఉన్నట్టుగా గోళ్లు ఉన్నా, లేకపోయినా కొందరు వాటిని అదే పనిగా కొరుకుతుంటారు. అదేవిధంగా ముక్కులో వేళ్లు పెట్టుకోవడం, ఏం పని లేకున్నా రాత్రి పూట బాగా సమయం అయ్యేంత వరకు మేల్కొని ఉండడం… ఇలా అనేక మందికి ఆయా అలవాట్లు ఉన్నాయి. అయితే ఇవే కాదు, ఇంకా కొన్ని అలవాట్లు కూడా మనకు ఉన్నాయి. వీటన్నింటితో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు కొరకడం అనేది చాలా చెడు అలవాటు. ఎందుకంటే గోళ్లు లేకపోయినా వాటి స్థానంలో క్రిములు పుష్కలంగా ఉంటాయి. నిత్యం మనం వివిధ సందర్భాల్లో చేతుల్తో ఏది పట్టుకున్నా అది గోళ్లు ఉండే స్థానానికి తాకుతుంది. ఈ క్రమంలో ఆ గోళ్లను అలాగే కొరికితే అక్కడే ఉండే క్రిములు మన నోటి ద్వారా శరీరంలోకి చేరుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు వచ్చి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.
చాలా మంది పిల్లలకు నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు. అదేవిధంగా పిల్లలతోపాటు పెద్దలు కూడా ముక్కులో వేలు పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుతారు. అయితే ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమైనవే. ఎందుకంటే చేతి వేళ్లకు ఉండే క్రిములు ముక్కులోకి చేరి అటు నుంచి అవి శ్వాసకోశ అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. అప్పుడు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించుకునేందుకు సన్ గ్లాసెస్ ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే. అయితే వాటిని మంచి క్వాలిటీగా ఉన్నాయో లేదో చూసుకుని ధరించాలి. అంటే మంచి కంపెనీ గ్లాసెస్‌ను ధరించాలి. లేదంటే యూవీ కిరణాల నుంచి మనకు రక్షణ లభించదు. దాంతో చర్మ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం… ఇలా మహిళలు ఎక్కువగా కూర్చుంటారు. సరే… ఎవరు కూర్చున్నా ఈ భంగిమ అంత ఆరోగ్యమైంది మాత్రం కాదు. ఎందుకంటే ఇలా కూర్చోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగ్గా సరఫరా అవదు. అప్పుడు వెరికోస్ వీన్స్, బీపీ వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కాళ్లలో ఉండే నరాలు దెబ్బతినేందుకు కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది నేడు కొవ్వు తీసిన పాలను ప్యాకెట్లలో తెచ్చుకుని తాగుతున్నారు. అయితే అలాంటి పాలు మనకు హానికరం. ఎందుకంటే పాల నుంచి కొవ్వును వేరు చేసే క్రమంలో దాంట్లో నుంచి మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు మాయమవుతాయి. దీంతోపాటు ఆ సమయంలో కలిపే సింథటిక్ పదార్థాల వల్ల మన శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
గుంపుగా పావురాలు లేదా ఇతర పక్షులు కనిపించినప్పుడు చాలా మంది వాటికి ఏదో ఒక ఆహారం వేస్తారు. అయితే అది ఓకే. కానీ ఆ ఆహారాన్ని చేతిలో ఉంచుకుని పక్షులకు తినిపించకూడదు. ఎందుకంటే పక్షులు మన చేతిలో వాలినప్పుడు వాటి నుంచి కొన్ని లక్షల సంఖ్యలో క్రిములు మన చేతుల్లోకి ప్రవేశిస్తాయి. అనంతరం అవి నోట్లోకి, జీర్ణాశయంలోకి చేరి మనకు ఇబ్బందులను కలిగిస్తాయి. కనుక ఆహారం చేతిలో ఉంచుకుని పక్షులకు తినిపించకూడదు. చాలా మందికి నిండా ముసుగు తన్ని పడుకోవడం అలవాటు. అయితే అలా చేయడం వల్ల తల మొత్తం దుప్పట్లో ఉంటుంది కనుక అప్పుడు అందులోనే మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మన శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో అది మెదడుపై ప్రభావం చూపుతుంది. కనుక తల వరకైనా దుప్పటి బయట పెట్టి పడుకోవడం ఉత్తమం.
చాలా మందికి ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి కదా. దీంతో గంటల తరబడి హెడ్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుంటున్నారు. పాటలు వింటున్నారు. అయితే అలా చేయడం వల్ల చెవి లోపలి కండరాలు దెబ్బ తిని తద్వారా చెవుడు వచ్చే అవకాశాలు ఉంటాయట. ఎల్లప్పుడూ బరువు బాగా ఉన్న బ్యాగులు లేదా ఇతర వస్తువులను మోయకూడదు. అలా చేస్తే మెడ, వెన్నెముకపై ఒత్తిడి కలుగుతుంది. తద్వారా ఆయా ప్రదేశాల్లో నొప్పులు వచ్చి బాధిస్తాయి. మహిళలు హై హీల్స్ ధరించరాదు. అలా చేస్తే కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వస్తాయి. గాయం తగిలితే ఎంత బాధ కలుగుతుందో అలాంటి నొప్పులు కాలికి వస్తాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉంటుండడంతో నేడు చాలా మంది అర్థరాత్రి వరకు వాటిని ఆపరేట్ చేస్తూ ఎప్పుడో లేట్‌గా నిద్రిస్తున్నారు. కానీ అలా చేయకూడదు. చేస్తే కంటి కింద నల్లని వలయాలు ఏర్పడడమే కాదు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి వస్తాయి.
చాలా మంది ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ మానేసి డైరెక్ట్‌గా మధ్యాహ్నం తింటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీర మెటబాలిజం తగ్గుతుంది. తద్వారా ఆకలి బాగా వేయడమే కాదు, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినేలా చేస్తుంది. దీంతో బరువు పెరుగుతారు. కనుక బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానకూడదు. మహిళలు కొందరు రోజంతా మేకప్‌తో అలాగే ఉండి రాత్రి పూట దాన్నితీయకుండానే నిద్రిస్తారు. దీంతో ఏమవుతుందంటే చర్మం ఇన్‌ఫెక్షన్ కు గురై దద్దుర్లు వస్తాయి. చర్మం మంట పుడుతుంది. కొన్ని సందర్భాల్లో అది నేత్ర సమస్యలకు దారి తీయడమే కాదు, కంటి చూపుపై కూడా ప్రభావం చూపిస్తుందట.