Kidneys : మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తంలోని అనవసర పదార్థాలను వడపోయడమే మూత్రపిండాల యొక్క ప్రధాన ప్రక్రియ. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ తరువాత స్థానంలో మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారే ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం జీవన విధానం, అనారోగ్యపు ఆహారపు అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ యాసిడ్లు, ఎక్కువ కొవ్వు కలిగిన పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఎక్కువగా భారం పడుతుంది. దీని వల్ల మూత్రపిండాల మీద ఒత్తిడి ఎక్కువగా పడి మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు వస్తున్నాయి. మూత్రపిండాలు రక్తపోటును అదుపులో, ఎర్రరక్తకణాల ఉత్పత్తి వంటి వాటిలో కూడా ఉపయోగపడతాయి.
కాబట్టి శరీరానికి మూత్రపిండాలు చాలా అవసరమైన అవయవాలు. అందువల్ల ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కవగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం వల్ల మూత్రపిండాల పనితీరు సజావుగా సాగుతుంది. మూత్రపిండాలకు సంబంధించి చిన్న ఆరోగ్యం వచ్చిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. కనుక మూత్రపిండాల వైఫల్యాలను సూచించే సంకేతాలపై ప్రతి ఒక్కరు ఆవహాగాన కలిగి ఉండడం అవసరం. మూత్రపిండాల వైఫల్యాన్ని సూచించే సంకేతాలను, లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రం రంగు మారడం, కొన్ని సార్లు ముదురు రంగులో మారడం, అలాగే మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు మంటగా ఉండడం, తక్కువగా మూత్రవిసర్జనుకు వెళ్లడం లేదా ఎక్కువగా వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలన్నీ మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తాయి. అంతేకాకుండా మోకాళ్లు, కీళ్లు, ముఖంలో వాపు రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేనప్పుడు, బలహీనంగా మారినప్పుడు ఎక్కువ మోతాదులో ఫ్లూయిడ్స్ శరీరం నుండి బయటకు వెళ్లిపోవడం వల్ల ఇలా కీళ్లల్లో వాపు వస్తుంది. ఇవి అన్నీ మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తాయి. అలాగే తరచూ శ్వాస అందకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే మూత్రపిండాల వైఫల్యానికి సంకేతంగా భావించాలి.
దీనికి ప్రధాన కారణం శరీరంలో ఎక్కువగా వ్యర్థాలు పేరుకుపోవడం. దీని వల్ల ఎర్ర రక్తకణాలు శరీరంలో తగ్గిపోతాయి. శరీరం సరిగ్గా ఆక్సిజన్ ను పొందలేకపోతుంది. రక్తంలో వ్యర్థ పదార్థాలు ఉన్నాయంటే నోట్లో మెటాలిక్ టేస్ట్ ఉన్నట్టుగా ఉంటుంది. ఆహారం రుచిలో కూడా మార్పు వస్తుంది. ఒక వేళ మూత్రపిండాలు ఫెయిల్ అయితే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీని వల్ల మైకం,తల తిరగడం, ఏకాగ్రత కుదరకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్కటెముకల కింది భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది అంటే మూత్రపిండాల్లో రాళ్లు అన్నాయని అర్థం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటే అవి శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆక్సిజన్ శరీరం అంతా సరఫరా అవుతుంది. ఒకవేళ ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉంటే అది అలసటకు, మెదడు సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
మూత్రపిండాల ద్వారా ఎక్కువగా ప్రోటీన్స్ బయటకు వెళ్లినప్పుడు కళ్లు వాపులు వస్తాయి. ఇలాంటి లక్షణాలను కనిపించగానే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. ఎలక్ట్రోసైట్ ఇన్ బ్యాలెన్స్ వల్ల మూత్రపిండాల పక్రియలో ఆటంకం కలుగుతుంది. రక్తంలో మినరల్స్, ప్రోటీన్స్ ను మూత్రపిండాలు సరైన స్థితిలో బ్యాలెన్స్ చేయలేకపోతే చర్మం పై దురద మొదలవుతుంది. దురద ఎక్కువగా ఉన్నప్పుడు క్రీములు, మందులను వాడడం కంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది. శరీరంలో కనుక ఇటువంటి మార్పులను గ్రహించినట్టయితే మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టుగా భావించాలి. మూత్రపిండాల సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త వహించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.