Lord Venkateshwara : శ్రీ వారు.. కలియుగ దేవుడు ఆ ఏడు కొండల స్వామి కోరిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే ఆపద మొక్కుల వాడు. అలాంటి స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత విషయమేం కాదు. ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది మనం నిత్యం భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉండాలంటే కింద చెప్పిన సూచనలను పాటిస్తే చాలని పండితులు చెబుతున్నారు. మనిషి జీవిత కాలంలో శని దేవున్ని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అది పోవాలంటే వెంకటేశ్వరుని స్వామికి నిత్యం పూజలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఆయన కరుణ ఉంటే చాలు ఎటువంటి దోషాలు ఉండవు. ప్రతి శనివారం ఇలా చేస్తే మనపై ఆయన కరణాకటాక్షాలు ఉండడమే కాకుండా శని దోషం మన దరికి రాదు. శనివారం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని అలాగే దేవుని గదిని శుభ్రం చేయాలి.
తరువాత వెంకటేశ్వర స్వామి ఫోటోకు ఎడమ వైపు ఖచ్చితంగా లక్ష్మీ దేవి ఫోటో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే స్వామి వారికి లక్ష్మీ దేవి గుండెల్లో కొలువై ఉంటుంది. అందుకే మనం ఇద్దరిని కలిపి ఉంచి ఆశీర్వాదం తీసుకోవాలి. ముందుగా బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటి పండు వేసి కలిపి చపాతీ లాగా చేసి దానితోనే ప్రమిద లాగా చేయాలి. అనగా బియ్యం పిండి ప్రమిద అన్న మాట. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెలిగించి వెంకటేశ్వర స్వామి ముందు పూజ చేయాలి. స్వామి వారికి తులసి మాల అంటే ఇష్టం. కనుక నిత్యం ఆయనకు తులసి ఆకులు, తులసి మాల వేస్తే త్వరగా మనల్ని అనుగ్రహిస్తాడు.

అయితే శని ప్రభావంతో పాటు ఇతర సమస్యలు ఎక్కువగా ఉంటే 8 శనివారాలు ఖచ్చితంగా పూజ చేయాలి. ఇలా 8 వారాల పాటు పూజ చేసే సమయంలో ఎటువంటి అడ్డంకులైన వస్తే మళ్లీ తిరిగి ఎక్కడైతే ఆపామో అక్కడి నుండి మొదలు పెట్టవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనా వెంకటేశ్వర నామాలను ఎప్పుడూ మనసులో తలుస్తూ ఉండాలి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లినప్పుడు కూడా ముందుగా ఆయన నామాన్ని చూస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా పూజ చేస్తూ నిత్యం వెంకటేశ్వర స్వామి నామాలను మనసులో అనుకుంటూ ఉంటే ఆ స్వామి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.