మిల్క్‌షేక్స్, స్మూతీలు అంటే చాలా మందికి ఇష్టమే. మనకు నచ్చిన పండును ఐస్ క్యూబ్స్, పాలతో కలిపి మిల్క్ షేక్స్ తయారు చేస్తాం. స్మూతీలను కూడా దాదాపుగా అలాగే తయారు చేస్తాం. ఇక అరటి పండ్లలో బనానా మిల్క్ షేక్‌లను కూడా తయారు చేసి తాగుతుంటారు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. అవును.. అరటి పండు, పాలను ఒకేసారి తీసుకోరాదు. తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోండి..!
బరువు పెరగాలని చూసేవారు అరటి పండు, పాలను తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తుంటారు. అయితే బరువు పెరిగేందుకు అవి ఉపయోగ పడతాయని చెప్పవచ్చు. కానీ ఈ రెండింటినీ కలిపి మాత్రం తీసుకోరాదు. రెండింటినీ ఒకేసారి తీసుకోవాల్సి వస్తే కనీసం 20 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
అరటి పండు, పాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. ఇక ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఈ రెండింటి కాంబినేషన్ ను అస్సలు తీసుకోరాదు. తీసుకుంటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
ఆయుర్వేద ప్రకారం.. పాలు, అరటి పండ్ల కాంబినేషన్ మంచిది కాదు. రెండింటినీ కలిపి తీసుకోరాదు. తీసుకుంటే జఠరాగ్ని నశిస్తుంది. శరీరంలో విష పదార్థాలు తయారవుతాయి. దీంతో సైనస్, దగ్గు, జలుబు, అలర్జీలు వస్తాయి.
ఆయుర్వేద ప్రకారం.. పాలు, అరటి పండు రెండూ విరుద్ధ స్వభావాలు కలిగిన ఆహారాలు. అందువల్ల ఈ రెండింటి కాంబినేషన్ శరీరంలో ఆమం (విష పదార్థాలు)ను తయారు చేస్తుంది. దీంతో శరీరంలో అసమతుల్యతలు ఏర్పడుతాయి. శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. నీరు ఎక్కువగా చేరుతుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. తరచూ రెండింటినీ కలిపి తీసుకుంటే గుండె జబ్బులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అందువల్ల పాలు, అరటి పండ్లను కలిపి తీసుకోరాదు. అయితే రెండింటినీ ఒకేసారి తీసుకోవాల్సి వస్తే కనీసం 20 నిమిషాల పాటు వేచి చూడాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365