వైద్య విజ్ఞానం

టెస్టోస్టిరాన్‌ లోపం ఉన్న పురుషుల్లో కనిపించే లక్షణాలు ఇవే..!

స్త్రీలు, పురుషుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు వేర్వేరుగా ఉంటాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ అనబడే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. దీన్ని శృంగార హార్మోన్‌ అని పిలుస్తారు. పురుషుల్లో ఈ హార్మోన్‌ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. టెస్టోస్టిరాన్‌ లోపిస్తే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే…

శరీరంలో శక్తి లేకపోతే టెస్టోస్టిరాన్‌ తక్కువగా ఉన్నట్లు భావించాలి. వయస్సు మీద పడడం, డిప్రెషన్‌ వంటి కారణాల వల్ల కూడా శరీరంలో టెస్టోస్టిరాన్‌ లోపిస్తుంది. నిత్యం 8 గంటల పాటు నిద్రించడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో టెస్టోస్టిరాన్‌ పెరుగుతుంది. సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

టెస్టోస్టిరాన్‌ లోపం ఉన్నవారిలో అంగ స్తంభన సమస్యలు ఉంటాయి. ఇలా ఉంటే ఆ హార్మోన్‌ తక్కువగా ఉన్నట్లు భావించాలి. వైద్యలను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

these signs will appear if men have low testosterone

టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడుతుంది. దీంతే ఏకాగ్రత లోపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నా టెస్టోస్టిరాన్‌ లోపంగా అనుమానించాలి. మెడిటేషన్‌, యోగా, వ్యాయామం, మసాజ్‌ వంటివి చేయడం వల్ల టెస్టోస్టిరాన్‌ పెరుగుతుంది.

ఎల్లప్పుడూ విచారంగా డిప్రెషన్‌లో ఉండడం కూడా టెస్టోస్టిరాన్‌ లోపానికి కారణం కావచ్చు. ఇదే గనక కారణం అయితే నిత్యం సంతోషంగా ఉండేందుకు యత్నించాలి. డిప్రెషన్ నుంచి బయట పడే ఆలోచన చేయాలి. దీంతో టెస్టోస్టిరాన్‌ లోపం సమస్య పరిష్కారం అవుతుంది.

టెస్టోస్టిరాన్‌ లోపం ఉంటే కండరాలు క్షీణిస్తాయి. శరీరంలో అధికంగా కొవ్వు పెరుగుతుంది. అధిక బరువు పెరుగుతారు. పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్ల కింది భాగాల్లో వెంట్రుకలు సరిగ్గా పెరగవు. జుట్టు కుదుళ్ల సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.

టెస్టోస్టిరాన్‌ లోపం ఉన్నవారిలో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్‌ వస్తుంది. నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. టెస్టోస్టిరాన్‌ లోపం తగ్గాలంటే మద్యం, పొగ తాగడం మానేయాలి. నిత్యం వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

Admin

Recent Posts