Veins In Legs : ప్రస్తుత కాలంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. కనుక ఈ సమస్య బారిన పడిన వెంటనే తగిన చికిత్స తీసుకోవడం, జీవన విధానాన్ని మార్చుకోవడం చాలా అవసరం. అయితే కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోయినప్పటికి చాలా కాలం వరకు మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు.
కానీ అప్పుడప్పుడూ కొన్ని లక్షణాలు శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మనం జాగ్రత్త పడడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మనలో కనిపించే లక్షణాలు కాళ్ల నొప్పులు కూడా ఒకటి. కాళ్ల నొప్పులు వచ్చిన తరువాత కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. ఇలా కాళ్ల నొప్పులు వచ్చి తగ్గితే అవి కొలెస్ట్రాల్ కారణంగానే అని భావించాలి. అలాగే పాదాల నొప్పులు, కాళ్లు, పాదాలు ఉబ్బడం, కాళ్లల్లో సిరలు ఉబ్బడంవంటి వాటిని కూడాకొలెస్ట్రాల్ కారణంగానే అని భావించాలి. అలాగే ప్రేగులు, పాంక్రియాసిస్ గ్రంథి, కాలేయం మధ్యలో రక్తప్రసరణ సమస్యలు తలెత్తే అది కూడా కొలెస్ట్రాల్ సమస్యలుగా భావించాలి. అలాగే సిరలల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల గుండెకు, అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు.
దీంతో కాళ్లల్లో రంగు మారుతుంది. కండరాల తిమ్మిర్లు, కాళ్లు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కాళ్లల్లో సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది. అయితే అన్ని సార్లు ఈ సమస్య కొలెస్ట్రాల్ వల్ల కాకపోవచ్చు. డయాబెటిస్ తో బారినపడినప్పుడు, పోషకాహార లోపం, అధిక ఒత్తిడి వల్ల కూడా పాదాల్లో గుచ్చినట్టుగా ఉంటుంది. ఇక ఏది ఏమైనా కాళ్లల్లో , పాదాల్లో సమస్య వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.