స్త్రీ, పురుషులు ఇద్దరూ.. తమ ఎత్తుకు తగినట్లుగా ఎంత బరువు ఉండాలో తెలుసా..?

అధిక బరువు సమస్య అన్నది ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమైనప్పటికీ బరువు పెరిగితే అవస్థలు పడక తప్పదు. అయితే స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఎత్తుకు తగిన విధంగా ఎంత బరువు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పురషులు 5 అడగుల ఎత్తు ఉంటే 50 నుంచి 54 కిలోల బరువు ఉండవచ్చు. ఇక స్త్రీలు కూడా 5 అడుగుల ఎత్తు ఉన్నవారు ఇదే బరువు ఉండవచ్చు. అలాగే 5.1 అడుగుల ఎత్తు ఉంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ 51 నుంచి 55 కిలోల వరకు బరువు ఉండాలి. 5.2 అడుగుల ఎత్తు ఉంటే పురుషులు అయితే 56 నుంచి 60 కిలోల వరకు, స్త్రీలు అయితే 53 నుంచి 56 కిలోల వరకు బరువు ఉండాలి.

weight chart for all according to their heights

5.3 అడుగుల ఎత్తు ఉండే పురుషులు 57 నుంచి 61 కిలోల వరకు బరువు ఉండవచ్చు. అదే స్త్రీలు అయితే 54 నుంచి 58 కిలోల వరకు బరువు ఉండాలి. 5.4 అడుగుల ఎత్తు ఉన్నవారు పురుషులు 58 నుంచి 63 కిలోల వరకు, స్త్రీలు 56 నుంచి 59 కిలోల వరకు బరువు ఉండాలి. 5.5 అడుగుల ఎత్తు అయితే పురుషులు 60 నుంచి 65 కిలోల మధ్య, స్త్రీలు 57 నుంచి 61 కిలోల మధ్య బరువును కలిగి ఉండాలి.

ఎత్తు 5.6 అడుగులు ఉంటే పురుషుల బరువు 62 నుంచి 66 మధ్య, స్త్రీల బరువు 58 నుంచి 63 కిలోల మధ్య ఉండాలి. అలాగే 5.7 అడుగుల ఎత్తు ఉంటే 64 నుంచి 68 కిలోల మధ్య బరువును పురుషులు కలిగి ఉండాలి. స్త్రీలు అయితే 60 నుంచి 65 కిలోల మధ్య బరువు ఉండాలి. 5.8 అడుగుల ఎత్తు ఉన్నవారు పురుషులు 65 నుంచి 70 కిలోల మధ్య, స్త్రీలు 62 నుంచి 66 కిలోల మధ్య బరువు ఉండాలి.

అదే 5.9 అడుగుల ఎత్తు అయితే పురుషులు 67 నుంచి 72 మధ్య, స్త్రీలు 64 నుంచి 68 కిలోల మధ్య బరువును కలిగి ఉండాలి. ఎత్తు 5.10 ఉన్నవారు పురుషులు 69 నుంచి 74 కిలోల బరువు ఉండాలి. స్త్రీలు 65 నుంచి 70 కిలోల బరువు ఉండాలి. ఎత్తు 5.11 ఉంటే పురుషులు 71 నుంచి 76 కిలోల మధ్య, స్త్రీలు 67 నుంచి 71 కిలోల మధ్య బరువును కలిగి ఉండాలి.

ఎత్తు 6 అడుగులు ఉంటే పురుషులు 73 నుంచి 78 కిలోల మధ్య బరువు ఉండవచ్చు. స్త్రీలు 68 నుంచి 73 కిలోల మధ్య బరువు ఉండవచ్చు. ఎత్తు 6.1 అయితే పురుషులు 73 నుంచి 80 కిలోల మధ్య, స్త్రీలు 73 నుంచి 80 కిలోల మధ్యనే బరువును కలిగి ఉండాలి.

ఎత్తు 6.2 అడుగులు అయితే పురుషులు, స్త్రీలు 77 నుంచి 83 కిలోల మధ్య బరువు ఉండాలి. ఎత్తు 6.3 అయితే స్త్రీ, పురుషులు ఇద్దరూ 79 నుంచి 85 కిలోల మధ్య బరువు ఉండాలి.

ఇలా స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ ఎత్తులను బట్టి ఆయా విధంగా బరువు ఉండాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ బరువు ఉంటే దాన్ని అధిక బరువుగా భావించాలి. మరీ ఇంకా ఎక్కువ బరువు అయితే దాన్ని స్థూలకాయంగా పరిగణించాలి. ఈ క్రమంలోనే పట్టికలో సూచించిన విధంగా బరువును తగ్గాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.

Share
Editor

Recent Posts