ఫ్రూట్ సలాడ్ అంటే రకరకాల పండ్లను ముక్కలుగా కట్ చేసి వాటిని కలిపి తింటారని అందరికీ తెలిసిందే. అయితే ఫ్రూట్ సలాడ్‌లో ఏయే పండ్లను కలపాలి ? వేటిని ఫ్రూట్ సలాడ్ కోసం వాడవచ్చు ? అనే విషయం చాలా మందికి అర్థం కాదు. ఈ క్రమంలో అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఫ్రూట్ సలాడ్‌ను సిద్ధం చేసుకుని తినవచ్చు. అందులో ఏయే పండ్లను ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రూట్ సలాడ్ కోసం కింద తెలిపిన పండ్లను తీసుకోవాలి.
పైన తెలిపిన పండ్లను అవసరం ఉన్నంత మేర తీసుకుని వాటిని కట్ చేసి ముక్కలుగా చేయాలి. అనంతరం ఆయా పండ్ల ముక్కలను ఒక్కటిగా కలపాలి. దీంతో ఫ్రూట్ సలాడ్ తయారవుతుంది. అయితే ఇందులో బాదం పప్పు, కిస్మిస్, వాల్ నట్స్ ను కూడా కలిపి తినవచ్చు. దీంతో అద్భుతమైన పోషకాలు అందుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. నిత్యం అన్ని రకాల పండ్లను ఎలా తినాలి ? అని సందేహించే వారికి ఈ ఫ్రూట్ సలాడ్ ఉత్తమ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఒక్కో పండును విడివిడిగా తినేబదులు అన్ని పండ్లతో ఇలా సలాడ్ చేసుకుని తినడం వల్ల అన్ని పండ్లలో ఉండే పోషకాలు మనకు లభిస్తాయి. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, శక్తికి శక్తి లభిస్తాయి. పోషణ కూడా అందుతుంది.