mythology

చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన నీతి సూత్రాలు ఇవే!

రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోవాలని లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు. అన్న మాట గౌరవించే లక్ష్మణుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా చెబుతాడట. రథసారథి, పాలవాడు, వంటవాడు, సోదరులతోనూ ఎల్లప్పుడు స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది.

ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి. కానీ పొగిడేవారిని అసలు నమ్మవద్దని తెలిపాడు. విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పును పరోక్షంగా ప్రస్తావించాడు. విజయం ఎల్లప్పుడూ నిన్నే వర్తిస్తుందని అనుకోవడం తప్పు. శత్రువు చిన్నవాడేనని తక్కువ అంచనా వేయరాదు. ఎవరి బలమెంతో ఎవరికి తెలుసు. హనుమంతుడిని కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నానని రావణుడు లక్ష్మణుడితో తెలిపాడు.

do you know what ravan has told to laxmana before his death

రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ అత్యాశపరుడై ఉండకూడదు. దేవుడిని ప్రేమించడం లేదా ద్వేషించడం చేయి, కానీ దేనిపై అయినా అపారమైన దృఢనిశ్చయంతో ఉండాలి. సైన్యానికి అవకాశం ఇచ్చి అలసిపోకుండా రాజు పోరాటం సాగిస్తేనే గెలుపు సొంతమవుతుందని లక్ష్మణుడికి చెబుతూ రావణ బ్రహ్మ ప్రాణాలు వదిలాడు. ఆయన చెప్పిన మాటలు ఈ కాలంలో మన జీవితాలకు వర్తిస్తాయి. ఈ విషయాలు రామాయణంలో ఉన్నాయి. రావణుడు నోటి నుంచి వెలువడిన విలువైన మాటలు ఈ లోకానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో రాముడు, లక్ష్మణుడిని అతని దగ్గరకు పంపి తెలుసుకోమంటాడట.

Admin

Recent Posts