mythology

Kumbhkaran : కుంభ‌క‌ర్ణుడు ఆరు నెల‌లు ఎందుకు నిద్ర‌పోయేవాడో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kumbhkaran &colon; ఎవరైనా ఎక్కువ సేపు నిద్రపోతే కుంభకర్ణుడిలా పడుకుంటున్నావ‌ని చెప్తూ ఉంటారు&period; మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు&period; కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడ‌ని చెబుతారు&period; అయితే&comma; అసలు ఎందుకు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయేవాడు&period;&period;&quest;&comma; దాని వెనుక కారణం ఏమిటి&period;&period;&quest; ఏదైనా శాపం ఉందా లేదంటే ఎవరైనా వరం చేర్చారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period; సాధారణంగా ఒకటి&comma; రెండు రోజులు నిద్రపోవడమే కష్టంగా ఉంటుంది&period; కానీ&comma; కుంభకర్ణుడు ఏకంగా ఆరు నెలల పాటు నిద్రపోయేవాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన పురాణాల ప్రకారం చూసినట్లయితే కూడా కుంభకర్ణుడు ఆరు నెలలు నిజంగా నిద్ర పోయినట్లు ఉంది&period; కుంభకర్ణుడి పాత్ర కొంచెం విడ్డూరంగా ఉంటుంది&period; నమ్మలేని విధంగా అనిపిస్తూ ఉంటుంది&period; అయితే&comma; కుంభకర్ణుడు ఎందుకు ఆరు నెలలు నిద్రపోయాడు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం&period; కుంభకర్ణుడు రావణుడి సోదరుడు&period; కుంభకర్ణుడు పుట్టగానే దొరికిన జంతువులన్నింటినీ పట్టుకుని తినేస్తూ ఉండేవాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57073 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kumbh-karan&period;jpg" alt&equals;"why kumbh karan sleeps for 6 months " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి&comma; కుంభకర్ణుడిని తరిమాడు&period; అయినా కూడా ఆయనే అతను చేష్టలకి భయపడవలసి వచ్చింది&period; కుంభకర్ణుడు రావణునితో వెళ్లి&comma; బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు&period; రావణుడి కంటే ఎక్కువ తపస్సు చేయడంతో దేవతలు భయపడిపోయారు&period; బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు&period; ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఏ విద్యను సాధిస్తాడు అని అందరూ ఆందోళన చెందారు&period; అందుకని బ్రహ్మని కాపాడాలని వేడుకున్నారు&period; బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి దేవి కుంభకర్ణుడు నాలుక మీద నిల్చుని ఆరు నెలలు నిద్ర&comma; ఒక రోజు భోజనం కావాలని పలికించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా బ్రహ్మ కుంభకర్ణుడు అడిగినట్లే వరమిచ్చాడు బ్ర‌హ్మ‌&period; కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం&comma; ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారు&period; కుంభకర్ణుడు తీసే గురకకి అందరి చెవులు చిల్లులు పడేవి&period; కుంభకర్ణుడి నోటి నుండి వచ్చే గాలికి సైనికులు విసిరినట్లు పడిపోయేవారు&period; రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం ఎంతో కష్టమైంది&period; సినిమాలో ఈ సీన్లు మీరు చూసే ఉంటారు&period; అలాగే పురాణాల ప్రకారం ముందు శాపం ఉండ‌డం వలన కుంభకర్ణుడిగా అవతరించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts