Air Purifier Plants : ఈ 5 మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోండి.. గాలి మొత్తం శుద్ధి అవుతుంది..!

Air Purifier Plants : మ‌నం మ‌న ఇంటి పెర‌టితో పాటు ఇంట్లో కూడా అనేక‌ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాము. ఇంటి లోప‌ల ఇండోర్ ప్లాంట్ ల‌ను కూడా మ‌న‌లో చాలా మంది పెంచుకుంటున్నారు. ఇంటి లోప‌ల పెంచుకునే ఈ ఇండోర్ మొక్క‌లు అందంగా ఉండ‌డంతో పాటు మ‌న ఇంట్లో ఉండే గాలిని కూడా శుభ్ర‌ప‌రిచి స్వ‌చ్ఛ‌మైన‌, ఆరోగ్యక‌ర‌మైన గాలిని మ‌న‌కు అందిస్తాయి. ముఖ్యంగా దీపావ‌ళి స‌మ‌యంలో ఈ మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లో త‌ప్ప‌కుండా పెంచుకోవాలి. దీపావ‌ళి స‌మ‌యంలో బ‌య‌ట గాలితో పాటు ఇంట్లో గాలి కూడా క‌లుషిత‌మ‌వుతుంది. అలాంటి స‌మయంలో ఇంట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం వల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా పెర‌గ‌డంతో పాటు గాలి కాలుష్యం కూడా త‌గ్గుతుంది. ఈ మొక్క‌లు ఇంటికి కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను తీసుకువ‌స్తాయి. మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన ఇండోర్ మొక్క‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల‌ల్లో క‌ల‌బంద మొక్క కూడా ఒక‌టి. ఇంట్లో ఎండ త‌గిలే చోట ఈ మొక్క‌ను ఉంచాలి. క‌ల‌బంద గాలిని స‌మ‌ర్థ‌వంతంగా శుభ్రం చేయ‌డంలో మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఇది గాలి నుండి బెంజిన్, ఫార్మాల్డిహైడ్ ను తొల‌గించ‌డంలో మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే ఈ క‌ల‌బంద మొక్క‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. అలాగే బ‌హుళార్ద‌క సాధ‌క మొక్క‌ల‌ల్లో స్నేక్ ప్లాంట్ కూడా ఒక‌టి. ఈ మొక్క 107 కాలుష్య కార‌కాల‌ను గాలి నుండి తొల‌గించ‌గ‌ల‌దు. అలాగే ఈ మొక్క ఆక్సిజ‌న్ ను కూడా ఎక్కువగా ఉత్ప‌త్తి చేస్తుంది. క‌నుక ఈ మొక్క‌ను బెడ్ రూమ్ లో పెంచుకోకూడ‌దు. ఈ మొక్క‌ను కూడా మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో పెంచుకోవ‌చ్చు.

Air Purifier Plants put them in your home for many benefits
Air Purifier Plants

ఇక ర‌బ్బర్ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు మేలు క‌లుగుతుంది. ఈ మొక్క‌ను పెంచ‌డానికి నీరు ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాగే ద్ర‌వ‌రూపంలో ఉండే ఎరువుల‌ను ఎక్కువ‌గా అందిచాల్సి ఉంటుంది. హానిక‌ర‌మైన కాలుష్య కార‌కాల‌ను గ్ర‌హించ‌డంలో, విష స‌మ్మేళ‌నాల‌ను విచ్చిన్నం చేయ‌డంలో, ఆక్సిజ‌న్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేయ‌డంలో ఈ మొక్క మ‌నకు స‌హాయ‌ప‌డుతుంది. ఇక ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల‌ల్లో పీస్ లిల్లీ కూడా ఒక‌టి. ఇది ఒక సున్నిత‌మైన మొక్క అని చెప్ప‌వ‌చ్చు. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. దీని పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్, కార్బ‌న్ మోనాక్సైడ్ వంటి విష వాయువుల‌ను గ్ర‌హించ‌డంలో ఈ మొక్క మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

కిచెన్ లో, బాత్ రూమ్ ల ద‌గ్గ‌ర ఈ మొక్క‌ను పెంచుకోవాలి. అల‌గే ఆర్కిడ్ మొక్క‌ల‌ను కూడా మ‌నం ఇంట్లో పెంచుకోవ‌చ్చు. ఎండ ఎక్కువ‌గా త‌గిలే చోట ఈ మొక్క‌ల‌ను ఉంచాలి. గోడ‌ల‌కు వేసే పెయింట్ లో ఉండే జీలీన్ ను తొల‌గించ‌డంలో ఇవి మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ మొక్క పూలు కూడా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ఈ విధంగా ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల ఇంటికి చ‌క్క‌టి అందాన్ని తీసుకురావ‌డంతో పాటు గాలిని కూడా శుభ్ర‌ప‌రిచి గాలి కాలుష్యాన్ని త‌గ్గించ‌డంలో మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

Share
D

Recent Posts