Alasanda Chaat : అల‌సంద‌ల‌తో క‌మ్మ‌నైన చాట్‌ను ఇలా చేసి తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

Alasanda Chaat : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. అల‌సంద‌ల్లో ప్రోటీన్ తో పాటు ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అల‌సంద‌ల‌తో కూర‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే వీటితో మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన చాట్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల‌తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్స్ గా లేదా అన్నంలోకి సైడ్ డిష్ గా కూడా దీనిని తీసుకోవ‌చ్చు. ఈ అల‌సంద‌చాట్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీనిని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ అల‌సంద‌ల చాట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అల‌సంద‌ల చాట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అల‌సంద గింజ‌లు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాలు -ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, స‌న్న‌గా పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Alasanda Chaat recipe in telugu make in this method
Alasanda Chaat

అల‌సంద‌ల చాట్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అల‌సంద‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 2 నుండి 3 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని మ‌రోసారి క‌డిగి కుక్క‌ర్ లోకి తీసుకోవాలి. త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి కుక్క‌ర్ మూత పెట్టాలి. వీటిని 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని నీరంతా పోయేలా వ‌డ‌క‌ట్టాలి. త‌రువాత ధ‌నియాల‌ను, వెల్లుల్లి రెబ్బ‌లను రోట్లో వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత దంచిన ధ‌నియాల మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన అల‌సంద గింజ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల‌సంద‌ల చాట్ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిని వ‌ద‌న‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts