Almonds Tea : బాదం టీని రోజూ తాగితే ఇన్ని లాభాలు క‌లుగుతాయా.. ఈ విష‌యాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Almonds Tea : మ‌న ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో , పోష‌కాలు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. సాధార‌ణంగా ఈ బాదంప‌ప్పును మ‌నం నాన‌బెట్టి పొట్టు తీసేసి తీసుకుంటూ ఉంటాము. అలాగే తీపి వంట‌కాల్లో వాడుతూ ఉంటాము. కొంద‌రు నేరుగా లేదా వేయించి తీసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా బాదంపప్పుతో మనం టీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బాదంప‌ప్పుతో చేసే ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని రోజూ తీసుకోవ‌చ్చు. లేదంటే వారానికి రెండు నుండి మూడుసార్లు తీసుకోవ‌చ్చు. ఈ టీని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం.

ఈ టీని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదంప‌ప్పుతో టీని ఎలా త‌యారు చేసుకోవాలి.. ఈ టీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి…. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బాదంప‌ప్పుతో టీని త‌యారు చేసుకోవ‌డానికి గానూ 5 బాదంప‌ప్పుల‌ను జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని ఒక గ్లాస్ పాల‌ల్లో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ పాల‌ను 5 నిమిషాల పాటు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక క‌ప్పు నీళ్లు పోసుకోవాలి. త‌రువాత ఇందుల ఒక టీ స్పూన్ టీ పొడి, 3 టీ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్, అర టీ స్పూన్ యాల‌కుల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి వేడి చేయాలి. ఈ టీని 5 నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న బాదంపాల‌ను పోసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

Almonds Tea how to make it amazing health benefits
Almonds Tea

త‌రువాత ఈ టీని వ‌డ‌క‌ట్టి క‌ప్పులో పోసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా బాదం టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. త‌రుచూ తాగే టీ, కాఫీల‌కు బ‌దులుగా ఇలా బాదం టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. బాదం టీని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మెద‌డు చురుకుగా పని చేస్తుంది. అల్జీమ‌ర్స్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి.రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. బాదం టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌లికాలంలో ఇలా బాదం టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంతో పాటు చ‌లినుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది. ఈ విధంగా బాదం టీ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టీ, కాఫీల‌కు బ‌దులుగా ఇలా బాదం టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts